Tirumala Services Into WhatsApp Governance: తిరుమల భక్తులకు భారీ శుభవార్త. వాట్సప్ ద్వారా తిరుమల సేవలను పొందవచ్చు. ఫోన్ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం సేవలను వాట్సప్ గవర్నెన్స్ ద్వారా అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. వాట్సప్ ద్వారా ఎలా తిరుమల సేవలు పొందాలో తెలుసుకుందాం.
తిరుమల తిరుపతి దేవస్థానం సేవలు పొందాలంటే ఇప్పుడు చాలా సులువు. ఆన్‌లైన్ ద్వారా తిరుమల సేవలను సులభతరంగా పొందవచ్చు. తాజాగా ఈ సేవలను మరింత సులువు చేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌరులకు రెవెన్యూ, ప్రభుత్వ సేవలు మొత్తం 161 సేవలను వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందిస్తోంది. ప్రభుత్వ సేవలను వాట్సప్‌తో అందిస్తుండడంతో ప్రజలు అరచేతిలోనే పొందుతున్నారు. వాట్సప్ గవర్నెన్స్ పరిధిలోకి మరిన్ని సేవలను విస్తరించనుంది.
వాట్సప్ గవర్నెన్స్ పరిధి విస్తృతం చేస్తూ దాని పరిధిలోకి మరిన్ని సేవలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని పరిధిలోకి తిరుమల తిరుపతి దేవస్థానం సేవలు కూడా చేర్చాలని ఏపీ ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది.
అమరావతిలో మంగళవారం వాట్సప్ గవర్నెన్స్ సేవలపై సమీక్ష చేసిన సీఎం చంద్రబాబు టీటీడీ సేవలపై కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. టీటీడీ సేవలను కూడా వాట్సప్ గవర్నెన్స్ పరిధిలోకి తీసుకువచ్చే అంశాన్ని పరిశీలించాలని ఆదేశించారు.
వాట్సాప్ గవర్నెన్స్‌లోకి టీటీడీ తీసుకోవాలని సీఎం చంద్రబాబు చెప్పారు. వాట్సాప్ గవర్నెన్స్‌లోకి టీటీడీ సేవలను కూడా తీసుకురావాలని అధికారులకు ఆదేశించారు. ప్రభుత్వ నిర్ణయంతో తిరుమల సేవలు వాట్సప్ గవర్నెన్స్ ద్వారా సులువుగా పొందే అవకాశం రానుండడంతో భక్తులకు భారీ ప్రయోజనం లభించనుంది.