Delhi CM Candidate: 26 ఏళ్ల తరువాత బీజేపీ ఢిల్లీ పీఠాన్ని అధిరోహించనుంది. ఆప్ అగ్రనేతలు అరవింజ్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్లు పరాజయం పొందిన ఈ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్‌ను మట్టి కరిపించి సంచలనం సృష్టించారు బీజేపీ న్యూ ఢిల్లీ అభ్యర్ధి పర్వేష్ సాహెబ్ సింగ్ వర్మ. ఇప్పుడు ఢిల్లీ పీఠాన్ని అధిరోహించే వ్యక్తిగా ఈయన పేరే విన్పిస్తోంది.
ఢిల్లీ పీఠాన్ని ఎట్టకేలకు బీజేపీ అధిరోహించడంతో ఇప్పుడు సీఎం ఎవరనే ఆసక్తి పెరిగింది. ఆశావహులు చాలామందే ఉన్నా ఒక్కరి పేరు ప్రధానంగా విన్పిస్తోంది. ఆ వ్యక్తి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహెబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేష్ సింగ్ వర్మ. ఆప్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై విజయం సాధించారు. కేజ్రీవాల్‌పై 4089 ఓట్ల తేడాతో గెలిచిన పర్వేష్ సింగ్ వర్మ ఇప్పుడు సీఎం అభ్యర్ధి రేసులో ఉన్నారు. ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్ధి సందీప్ దీక్షిత్‌కు కేవలం 4 వేలు ఓట్లు పోలయ్యాయి.
పర్వేష్ సింగ్ వర్మ ఎవరు
ఈయన బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సాహెబ్ సింగ్ వర్మ కుమారుడు. పర్వేష్ సింగ్ వర్మ సొంత బాబాయ్ ఆజాద్ సింధ్ గతంలో ఉత్తర ఢిల్లీ మేయర్‌గా పనిచేశారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో స్కూల్ విద్యను అభ్యసించిన ఈయన బీఏ పూర్తి చేశాక ఎంబీఏ చేశారు.2013 ఢిల్లీ ఎన్నికల్లో తొలిసారిగా అరవింద్ కేజ్రీవాల్‌పై పోటీ చేసి గెలిచారు. కానీ 2014 లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ ఢిల్లీ నుంచి పోటీ చేసి విజయం సాధించడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 2019లో కూడా భారీ మెజార్టీతో ఎంపీగా గెలిచారు. ఎంపీగా ఈయనకు పదేళ్ల అనుభవం ఉంది. అర్బన్ డెవలప్మెంట్ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుల జీతాల పర్యవేక్షించే జాయింట్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. రాజకీయ కుటుంబ నేపధ్యం, ఎంపీగా పదేళ్ల అనుభవం, కేజ్రీవాల్‌పై రెండు సార్లు గెలవడం, విద్యార్హత వంటివి ఈయనకు సానుకూల అంశాలుగా ఉన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి