Indiramma Housing Scheme 2025: తెలంగాణ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఒకటి ఇందిరమ్మ ఇళ్లు. సొంత స్థలం ఉన్నవారికి 5 లక్షల రూపాయలు, అది కూడా లేనివారికి ఇంటి స్థలంతో పాటు 5 లక్షల రూపాయలు అందించనున్నారు. దీనికోసం 4. లక్షల ఇళ్లు సిద్ధం చేయనున్నారు. జనవరి 26 నుంచి ప్రారంభమైన ఈ పధకం లబ్దిదారుల జాబితాలో మీ పేరు ఉందా లేదా, లేకపోతే ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం.
తెలంగాణ ప్రభుత్వం 22 వేల కోట్ల బడ్జెట్‌తో రాష్ట్రంలోని నిరుపేదలకు 2.5 లక్షల ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు సిద్ధమైంది. జనవరి 26న ఈ పధకం ప్రారంభమైంది. ఇప్పటికే ఈ పధకం లబ్దిదారుల జాబితా సిద్ధమైంది. మీరు కూడా ఈ పధకం కోసం ఇప్పటికే అప్లై చేసుంటే మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి..
ముందుగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్ https://indirammaindlu.telangana.gov.in/ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో కన్పించే చెక్ లిస్ట్ క్లిక్ చేయాలి. ఇందులో మీ పేరు ఉందో లేదా తెలుసుకోవచ్చు. ఒకవేళ మీ పేరు లేకపోతే మరోసారి అప్లై చేసుకోవచ్చు.
ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లై చేసేందుకు కూడా ఇదే వెబ్‌సైట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత అప్లై ఆన్‌లైన్ క్లిక్ చేస్తే స్క్రీన్‌పై కన్పించే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి తగిన ధృవపత్రాలు సమర్పించాలి. చివర్లో ఓసారి చెక్ చేసి సబ్‌మిట్ చేయాలి. ఇందిరమ్మ ఇళ్లు యాప్ కూడా అందుబాటులో ఉంది. దీని ద్వారా ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లై చేసుకోవచ్చు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు వివరాలు ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లై చేసేందుకు ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్, ఎలక్ట్రిసిటీ బిల్లు, అడ్రస్ ప్రూఫ్, పాన్ కార్డు, రేషన్ కార్డు వివరాలు అవసరం.
Also read: PM Svanidhi Scheme: ఆధార్ కార్డు ఒక్కటి ఉంటే చాలు..2.5 లక్షలు పొందే అవకాశం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి