Union Budget 2025 Updates: కేంద్ర బడ్జెట్ 2025 ను కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వరుసగా 8వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలమ్మ ఈసారి వైద్య విద్యపై ప్రత్యేక దృష్టి సారించారు. రానున్న ఐదేళ్లలో ఏకంగా 75 వేల ఎంబీబీఎస్ సీట్లను పెంచనున్నారు.
కేంద్ర బడ్జెట్‌లో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వివిధ రంగాలపై వరాలు కురిపించారు. ముఖ్యంగా ఇన్‌కంటాక్స్ విషయంలో మద్య తరగతి వర్గాలకు ఊరటనిచ్చారు. ముఖ్యంగా మెడికల్ కళాశాలల్లో సీట్ల పెంపుపై ప్రకటన చేశారు. రానున్న ఐదేళ్లలో దేశంలో 75 వేల ఎంబీబీఎస్ సీట్లను పెంచనున్నామని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వచ్చే ఏడాది నుంచి మెడికల్ కళాశాలల్లో 10 వేల సీట్లు పెరగనున్నాయి. అదే విధంగా దేశంలోని ఐదు ఐఐటీలను అదనపు మౌళిక సదుపాయాలతో విస్తరించనున్నారు.
దేశవ్యాప్తంగా ప్రస్తుతం 1,2,112 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ప్రతి ఏాటా నీట్ పరీక్ష ద్వారా వైద్య విద్యలో ప్రవేశం ఉంటోంది. 2014 వరకూ దేశంలో 51,348 వైద్య విద్య సీట్లు, 38 మెడికల్ కళాశాలలు ఉన్నాయి. ఇప్పుడు మాత్రం దేశవ్యాప్తంగా 731 వైద్య కళాశాలలు ఉన్నాయి. మరో వైపు పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్ల సంఖ్య కూడా 2014 వరకూ 31,185 కాగా ఇప్పుడు 72,627 ఉన్నాయి.
Also read: Best Recharge Plan: రోజుకు 1 రూపాయితో రోజూ 1.5 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి