Vijayasai Reddy: వైఎస్ జగన్‌కు విజయసాయి రెడ్డి కౌంటర్.. అందుకే రాజకీయాలు వదిలేశా..!

Vijayasai Reddy Counter to YS Jagan: తనపై మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తాను ఎవరికి భయపడనని.. ఎవరికి ప్రలోభ పడలేదన్నారు. భయం అనేది తన అణువు అణువులో లేదన్నారు. 

Written by - Ashok Krindinti | Last Updated : Feb 7, 2025, 12:32 PM IST
Vijayasai Reddy: వైఎస్ జగన్‌కు విజయసాయి రెడ్డి కౌంటర్.. అందుకే రాజకీయాలు వదిలేశా..!

Vijayasai Reddy Counter to YS Jagan: ఏపీ ఎన్నికలు లేకపోయినా రాజకీయాలు మాత్రం ఫుల్ హీట్‌హీట్‌గా ఉంటున్నాయి. ఈసారి జగన్ 2.O చూస్తారంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన మాటలకు పదును పెట్టారు. ఎవరూ కూడా వైఎస్సార్‌సీపీ కార్యకర్తల వెంట్రుక కూడా పీకలేరంటూ క్యాడర్‌లో పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నింపారు. ఓ వైపు కీలక నేతల రాజీనామాల నేపథ్యంలో జగన్ వ్యాఖ్యలు కేడర్‌కు బలాన్ని చేకూరుస్తున్నాయి. మరోవైపు పార్టీ వీడిన నేతలపై కూడా కామెంట్స్ చేశారు. రాజకీయాల్లో వ్యక్తిత్వం, విశ్వాసం అనేవి ముఖ్యమని.. ప్రలోభాలకు లొంగి.. లేదంటే భయపడి వ్యక్తిత్వం తగ్గించుకుంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు. ఇది ఒక్క విజయసాయి రెడ్డికే కాదని.. గత కొన్ని నెలలుగా పార్టీ నుంచి వెళ్లిపోయినవారికి.. రేపోమాపో పార్టీ నుంచి వెళ్లిపోయే వారికి కూడా వర్తిస్తుందన్నారు. వైఎస్సార్సీపీ పార్టీ ఇవాళ ఉంది అంటే అది నాయకుల వల్ల కాదని.. దేవుడి దయ.. ప్రజల ఆశీస్సుల ఉందన్నారు.

తన రాజీనామాపై జగన్‌ స్పందించడంతో మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తాను ఎవరికి భయపడను కాబట్టే ఎవరికి ప్రలోభ పడలేదని స్పష్టం చేశారు. వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే.. ఎవరికి ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదన్నారు. భయం అనేది తనలో ఏ అణువు అణువు లోను లేదని చెప్పారు. కాబట్టే రాజ్యసభ పదవిని, పార్టీ పదవులను మరి రాజకీయాలనే వదులుకున్నానంటూ ట్వీట్ చేశారు.

ఇక అధికారంలో కోల్పోయిన తరువాత వరుస రాజీనామాలతో ఇబ్బంది పడుతున్న వైసీపీ మళ్లీ పుంజుకుంటోంది. జగన్ దూకుడు పెంచగా.. కాంగ్రెస్‌కు మాజీ మంత్రి శైలజానాథ్ షాకిస్తూ రాజీనామా చేశారు. శుక్రవారం వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ కండువా కప్పిన జగన్.. సాదరంగా వైసీపీలోకి ఆహ్వానించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా పని చేసిన శైలజానాథ్‌.. రాష్ట్ర విభజన అనంతరం పార్టీలో నాయకులు అందరూ వెళ్లిపోయినా ఆయన కాంగ్రెస్‌లోనే కొనసాగారు. ఏపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. అయితే వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరిక తరువాత ఆయన దూకుడు తగ్గించారు. ఎన్నికల తరువాత కాంగ్రెస్‌కు దూరంగా ఉంటున్నారు. ఎట్టకేలకు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి.. వైసీపీ గూటికి చేరిపోయారు. 

Also Read: Jaya Ekadashi: జయ ఏకాదశి ఎప్పుడు..?.. పూజా విధానం, ప్రాముఖ్యత ఏంటంటే..?

Also Read: Thandel Movie Review: ‘తండేల్’ మూవీ రివ్యూ.. నాగ చైతన్య హిట్ కొట్టినట్టేనా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News