Happy Rose Day 2025: రోజ్ డే అనేది వాలెంటైన్స్ వీక్‌లో ఒక ముఖ్యమైన రోజు. ఇది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 7 న జరుపుకుంటారు. ఈ రోజున ప్రేమికులు ఒకరికొకరు గులాబీ పువ్వులను ఇచ్చి తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. ఈ అద్బుతమైన రోజున మీ ప్రియమైన వారికి ఇలా రోజ్ డే విషెస్ తెలపండి.
ఊహతెలిసిన దగ్గరి నుంచి ఊహించలేదు.. ఊహించనంతగా నిన్ను ప్రేమిస్తానని..
ఎన్నెన్ని కాలాలు మారినా ఎదలో నీ జ్ఞాపకాలు మాత్రం ఎన్నటికీ మారవు..
ప్రేమ అనే కలంతో, హృదయం అనే కాగితంపై, జీవితమనే రాతను రాసి ఇస్తున్న హామీ ఈ ప్రమేలేఖ..
ప్రేమ అనేది ఒక వస్తువు కాదు, ఇది మన ఉనికిలో భాగం..
ప్రేమ అనేది ఒక అందమైన అనుభూతి. ఇది మనల్ని ఒకరితో ఒకరిని కలుపుతుంది, మన జీవితానికి అర్థాన్ని ఇస్తుంది..
ప్రేమ అనేది ఒక బహుమతి, అది మనకు ఇవ్వబడుతుంది.. మనం ఇతరులకు పంచుకోవాలి.
ప్రేమ అనేది ఒకరి కోసం మనం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండటం..
నిజమైన ప్రేమకు మాటలు అక్కర్లేదు.. చూపుతోనే అర్థమవుతుంది..