Thandel Movie Review: ‘తండేల్’ మూవీ రివ్యూ.. నాగ చైతన్య హిట్ కొట్టినట్టేనా..!

Thandel Movie Review: నాగ చైతన్య గత కొన్నేళ్లుగా కెరీర్ పరంగా డౌన్ ఫాల్లో ఉన్నాడు.  సోలో హీరోగా సక్సెస్ అందుకొని చాలా కాలమే అవుతుంది. తాజాగా ఈయన హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా చందూ మొండేటి దర్శకత్వంలో ‘తండేల్’ మూవీతో పలకరించారు. మరి ఈ సినిమాతో నాగ చైతన్య హీరోగా సక్సెస్ అందుకున్నాడా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..  

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 7, 2025, 12:39 PM IST
Thandel Movie Review: ‘తండేల్’ మూవీ రివ్యూ.. నాగ చైతన్య హిట్ కొట్టినట్టేనా..!

మూవీ రివ్యూ: తండేల్ (Thandel)
నటీనటులు: అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి, ప్రకాష్ బేలావాడి, రావు రమేశ్, కరుణా కరన్, కల్యాణి నటరాజన్ తదితరులు
సంగీతం: దేవీశ్రీ ప్రసాద్  
సినిమాటోగ్రఫీ: శ్యామ్ దత్
ఎడిటర్: నవీన్ నూలి
బ్యానర్స్: గీతా ఆర్ట్స్
నిర్మాతలు: అల్లు అరవింద్, బన్నీ వాసు  
దర్శకత్వం: చందూ మొండేటి
విడుదల తేది: 7-2-2025

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా టైటిల్ రోల్లో యాక్ట్ చేసిన చిత్రం ‘తండేల్’. ‘లవ్ స్టోరీ’ తర్వాత సాయి పల్లవి చైతూకు జోడిగా నటించింది. మరోవైపు ప్రేమమ్, సవ్యసాచి చిత్రాల తర్వాత చందూ మొండేటి, నాగ చైతన్య కాంబినేషన్ లో వస్తోన్న మూడో చిత్రం ‘తండేల్’. మరోవైపు 100% లవ్ తర్వాత గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నాగ చైతన్య హీరోగా నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకున్నాయి. మరి ఈ సినిమాతో చందూ మొండేటి నాగ చైతన్యకు సక్సెస్ అందించాడా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం.

కథ విషయానికొస్తే..

టి. మత్సలేషం గ్రామ ప్రజలకు చేపల వేటే ఆధారం. దాని కోసం వందల మైళ్ల దూరంలో ఉన్న గుజరాత్ రాష్ట్రానికి చేపలు ఎగుమతి చేస్తుంటారు. ఈ క్రమంలో ఆ ఊరి ప్రజలు  వృత్తి రీత్యా ఊర్లో కంటే సముద్రంలోనే ఎక్కువ కాలం ఉంటుంటారు. ఈ క్రమంలో అదే గ్రామంలో ఉండే మత్స్య కారులకు సంబంధించిన తండేల్ (లీడర్)  రాజు (నాగ చైతన్య),సత్య (సాయి పల్లవి) ప్రేమించుకుంటారు. అయితే.. రాజుకు సముద్రంలో అన్నిన్ని రోజులు వేటకు వెళ్లడం ఇష్టముండదు. అయితే.. ఆ వృత్తి మానేసి వేరే పని చూసుకోమని ఒట్టేయించుకుంటుంది. కానీ నమ్మిన వాళ్ల కోసం రాజు సముద్రంలో వేటకు వెళతారు. ఈ క్రమంలో అనుకోకుండా వాళ్ల ఓడ పాకిస్థాన్ జలాల్లోకి ప్రవేశించడంతో వాళ్లను తీసుకెళ్లి అక్కడి జైల్లో పడేస్తారు. ఈ క్రమంలో వారిని విడిపించుకోవడానికి సత్య ఎలాంటి పోరాటం చేసింది. మరి ఆమె పోరాటం ఫలించి పాకిస్థాన్ జైల్లో ఉన్న రాజు అతని అనుచరులు తిరిగి భారత్ వచ్చారా.. చిరవకు సత్య, రాజు ఒకటయ్యారా లేదా అనేది ‘తండేల్’ మూవీ స్టోరీ.

కథనం, టెక్నికల్ విషయానికొస్తే..

దర్శకుడు చందూ మెుండేటి ఆంధ్ర ప్రదేశ్ లోని మత్స్యలేషం గ్రామంలో జరిగిన నిజ జీవిత సంఘటనలను తీసుకొని.. దానికి లవ్ స్టోరీతో పాటు యాక్షన్, ఎమోషన్, దేశ భక్తితొ పాటు కొంత ఫిక్షన్ జోడించి అన్ని సమపాళ్లలో రంగరించి ప్రేక్షకులను మొదటి నుంచి చివరి వరకు  సీట్లో కదలనీయకుండా చేశాడు. మొత్తంగా ఫస్టాఫ్ హీరో, హీరోయిన్ ప్రేమ.. సముద్రంలో ఉన్న రాజుతో సత్య గంటల కొద్దీ ఇప్పటి లవర్స్ పగలు రాత్రి తేడా లేకుండా నిజ జీవితంలో ఎలా మాట్లాడుకుంటారో అలా లవర్స్ మధ్య ఫోన్ లో మాట్లాడుకోవడం వంటివికి..నాచురల్ గా చూపించాడు దర్శకుడు చందూ మొండేటి. మరోవైపు నాగ చైతన్య నుంచి ఇప్పటి వరకు అందరు లవర్ బాయ్ గానే చూపించారు. కానీ ఈ సినిమాలో  యాక్షన్ తో పాటు మంచి నటనను రాబట్టకున్నాడు. చైతూలో మంచి యాక్షన్ హీరోను ఎలివేట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా సత్య.. రాజును సముద్రంలో వెళ్లొద్దనే విషయంలో ఇద్దరి మధ్య ఏర్పడిన పొరపొచ్చాలు.. దీంతో రాజుతో సత్య మాట్లాడుకోకవడం వంటివి ప్రేక్షకులను  ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా చేస్తాయి.  ఇంటర్వెల్ కు ముందు రాజు అతని అనుచరులు పాకిస్థాన్ జలాల్లోకి అనుకోకుండా ప్రవేశించడంతో వాళ్లను అక్కడ నేవీవాళ్లు అరెస్ట్ చేస్తారు.

ఆ తర్వాత అప్పటి విదేశాంగ మంత్రి దివంత సుష్మా స్వరాజ్ రెండు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా వాళ్లను విడిచిపెట్టమని పాకిస్థాన్ ప్రభుత్వాన్ని కోరుతుంది. అయితే..వాళ్లను 2019 ఆగష్టు 15న విడిచిపెడతామని అక్కడ పాక్  ప్రభుత్వం చెబుతుంది. తీరా అదే యేడాది ఆగష్టు 4న కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370, 35 A రద్దు చేయడంతో రాజు అతని అనుచరుల విడుదల ఆగిపోతుంది. అప్పటికే అనారోగ్యంతో ఉన్న సుష్మా స్వరాజ్ .. ఆగష్టు 6న కన్నుమూస్తారు. ఈ క్రమంలో ఆమె కూతరు బాన్సూరి స్వరాజ్ వల్ల వారి ఊరి ప్రజలను కాపాడటంతో సహాయం చేస్తుందని ఏపీలో మంత్రి చెబుతారు. దీంతో ఆమె కలవడానికి సత్య ఢిల్లీ వెళ్లి ఆమెను కలవడానికి  ఎలాంటి ప్రయాసలు పడిందనే విషయాన్ని ఎంతో భావోద్వేగంగా ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా చూపించాడు. ఆమె చొరవ వల్ల తండేల్ రాజు అండ్ టీమ్  చివరకు విడుదల అయ్యే సమయంలో ఆ టీమ్ ఓ మెంబర్ కు ఐడెంటిటీ లేకపోవడం..అతన్ని పాకిస్థాన్ విడిచిపెట్టనని చెప్పడం వంటివి ప్రేక్షకులను  క్లైమాక్స్ లో ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా చేస్తాయి.

మరోవైపు పాకిస్థాన్ జైల్లో అక్కడ ఖైదీలు మన ఖైదీల పట్ల చేసే అమానుష చర్యలు.. మన జెండాను అవమానపరిచేందకు ప్రయత్నించే పాకిస్థాన్ ముష్కరులతో రాజు చేసే ఫైట్ సీన్ మాస్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. మరోవైపు జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికట్ 370 రద్దు తర్వాత పాకిస్థాన్ లో చెలరేగే అల్లర్ల కారణంగా తండేల్ రాజు అండ్ టీమ్  కోర్టు నుంచి కరాచి జైలుకు తరలించే సమయంలో అక్కడ పాకిస్థానీ ప్రజలు వీళ్లను చంపే ప్రయత్నం చేయడం.. రాజు అతని అనుచరులతో తప్పించుకొని తిరిగి కరాచీ జైలుకు రావడం వంటివి దేశ భక్తి అంశాలు ప్రేక్షకులను ఎమోషనల్ కనెక్ట్ అవుతారు. మొత్తంగా చందూ మొండేటి ‘తండేల్’ సినిమాతో దర్శకుడుగా మంచి మార్కులు కొట్టేశాడనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్ వరకు కొంత బోర్ కొట్టినా.. ఇంటర్వెల్ తర్వాత అసలు కథ మెదలుతుంది. మరోవైపు స్లో నేరేషన్ ప్రేక్షకులకు ఇబ్బంది పెడుతుంది.  ప్రేమకథకు, ఎమోషన్ జత కలిపి దానికి యాక్షన్, దేశ భక్తి జోడించి అన్ని వర్గాల ప్రేక్షకులు చూసేలా ఎలాంటి అసభ్యతకు తావు లేకుండా..సనాతన ధర్మాన్ని తెరపై చూపించడాన్ని ప్రేక్షకులు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు. దేవీశ్రీ ప్రసాద్ అందించిన సంగీతంతో పాటు ఆర్ఆర్ ఈ సినిమాకు ప్రాణంలా నిలిచింది. ముఖ్యంగా పాకిస్థాన్ జైల్లో దేవీశ్రీ అందించిన ఆర్ఆర్ అదిరిపోయింది.  సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

 ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?

నటీనటుల విషయానికొస్తే..
తండేల్ సినిమాలో నాగ చైతన్య కెరీర్ లో ప్రత్యేక చిత్రంగా నిలిచిపోతుంది. తండేల్ కు ముందు తండేల్ తర్వాత అనేంతగా నాగ చైతన్య కెరీర్ లో ఈ సినిమా మెమరబుల్ మూవీగా నిలిచిపోనుంది. ఈ సినిమాలో అన్ని రకాల భావోద్వేగాలను పండించాడు. ముఖ్యంగా లవ్, యాక్షన్, ఎమోషన్, దేశభక్తి అన్ని సీన్స్ లో మంచి నటన కనబరిచాడు. నటుడిగా చైతూ కెరీర్ లో లాండ్ మార్క్ మూవీ అని చెప్పొచ్చు. సాయి పల్లవి నటన గురించి ఎంత చెప్పినా.. తక్కువే. ఇందులో ప్రధాన పాత్రను ఆమెను తప్పించి మరో నటిని ఊహించుకోలేము. అమరన్ తర్వాత మరోసారి తండేల్ మూవీలో తన యాక్టింగ్ తో మెస్మరైజ్ చేసింది. ఈ చిత్రంతో జాతీయ ఉత్తమ నటి అవార్డు రావడం గ్యారంటీ అని చెప్పాలి. మరోవైపు పాకిస్థాన్ జైలర్ పాత్రలో నటించిన ప్రకాష్ బేలావాడి నటన బాగుంది. మిగిలిన పాత్రల్లో నటించిన నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు.

ప్లస్ పాయింట్స్

కథ, కథనం, దర్శకత్వం

చైతూ, సాయి పల్లవిల నటన

దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్

నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్

ఫస్ట్ హాఫ్

స్లో నేరేషన్

పంచ్ లైన్.. ‘తండేల్’.. యాక్షన్, ఎమోషన్, దేశభక్తితో కూడిన లవ్ స్టోరీ

రేటింగ్:3/5

ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..

ఇదీ చదవండి:   గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News