Urvashi Rautela reacts on daaku maharaaj movie: సంక్రాంతికి కానుకగా అభిమానుల ముందుకు వచ్చిన నందమూరీ బాలకృష్ణ మూవీ డాకు మహారాజ్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా భారీ వసూళ్ల దిశగా దూసుకుపోతుంది. బాలయ్య సినిమా అంటే.. మాస్ ఆడియన్స్ ముందుంటారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సారి మాస్ తో పాటు.. క్లాస్ ఆడియన్స్ కూడా బాలయ్య డాకు మహారాజ్ చూసేందుకు ఎగబడుతున్నారు. ఇదిలా ఉండగా.. డాకు మహారాజ్ మూవీ రిలీజ్ నేపథ్యంలొ ఆడియన్స్ బాలయ్య డైలాగులకు పూనకాలతో ఊగిపోతున్నారు. థియేటర్ లో విజిల్స్, క్లాప్స్ తో రెచ్చిపోతున్నారు.
బాలయ్య సినిమాలో డైలాగ్ లు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం బాలయ్య డాకు మహారాజ్ లోని.. దబిడి దిబిడి పాట కాంట్రవర్సీగా మారింది. ఈ పాటలో డ్యాన్స్ లు బాలయ్యకు ... సూట్ అవ్వడంలేదని నెటిజన్లు, ఆయన అభిమానులు ఫైర్ అవుతున్నారంట. ఒక ఎమ్మెల్యే, సీనియర్ హీరోకు ఇలాంటి స్టెప్పులు ఏంటని.. ఆయనకు కొరియో గ్రాఫీ చేసిన..శేఖర్ మాస్టర్ పై మండిపడుతున్నారు.
ఈ స్టెప్పులు ఆయన గౌరవాన్ని చిన్నది చేసేలా ఉన్నాయని కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా.. ఈ వివాదంపై దబిడి దిబిడిలో బాలయ్యతో కలిసి స్పెప్పులు వేసిన ఊర్వశి రౌతేలా స్పందించారు. ఈ సినిమాలో బాలయ్యతో కలిసి చేయడం తన అదృష్టమన్నారు. అంతేకాకుండా.. సినిమా హిట్ టాక్ సొంతం చేసుకున్నప్పుడు కొంత మంది లేనీ పోనీ విమర్శలు చేస్తుంటారన్నారు. ఆయన ఒక లెజెండ్.
Read more: Saif Ali Khan Case: సైఫ్‌పై దాడి ఘటనలో కీలక పరిణామం.. దొరికిపోయిన నిందితుల ఆనవాళ్లు..
బాలయ్యతో కలిసి వర్క్ చేయడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. బాలయ్యతో కలిసి డ్యాన్స్ చేయడం.. చాలా ఆనందాన్ని ఇచ్చిందన్నారు. జీవితంలో ఏదీ సాధించలేనివారు కొంత మంది లేనీ పోనీ విధంగా ట్రోల్స్ చేస్తారని.. అలాంటి వారి కామెంట్లను పట్టించుకొవాల్సిన అవసరం లేదన్నారు. ఇదిలా ఉండగా.. ఈ మూవీ ఇప్పటికే.. రూ. 56 కోట్ల వసూళ్లను రాబట్టింది. అదే విధంగా బాలయ్య లైఫ్ లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీస్ లిస్ట్ లో డాకు మహారాజ్ కూడా చేరిపోయింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter