America Elections 2024: అమెరికాలో ప్రతి నాలుగేళ్లకు ఎన్నికలు జరగడం ఆనవాయితీ వస్తోంది. ప్రతి నాలుగేళ్లకు జరిగే లీఫ్ ఇయర్ నవంబర్ ఫస్ట్ మంగళవారం ఇక్కడ ఎలక్షన్స్ ను నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో ఎన్నికల్లో గెలిచిన వారు.. జనవరిలో పదవీ బాధ్యతలు చేపట్టడం ఆనవాయితీ వస్తుంది. నేడు జరగనున్న ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ తరుపున డొనాల్డ్ ట్రంప్ బరిలో ఉన్నారు. మరోవైపు డెమాక్రాట్స్ తరుపున అమెరికా ఉపాధ్యక్షురాలు కమల్ హారిస్ బరిలో ఉన్నారు.
మొత్తంగా ప్రపంచ అగ్రరాజ్యం అమెరికా ఎలక్షలపై ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. నేడు అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుంది. దాదాపుగా 24.4 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటికే 7.5 కోట్ల మంది ముందస్తు ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. మరోవైపు అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ తమ ప్రచార చివరి అంకంలో ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు. ముందస్తు ఓటింగ్‌లో ఇప్పటికే న్యూయార్క్ రికార్డు క్రియేట్ చేసింది. అది ఇంకా కొనసాగుతోందని ర్యాన్ వెల్లడించారు. న్యూయార్కే కాదు.. అమెరికా మొత్తం ఇదే ట్రెండ్ నడుస్తుంది. మెయిల్స్, పోలింగ్ కేంద్రాల ద్వారా వారంతా ఓట్లు వేస్తున్నారు.
రిపబ్లికన్ అభ్యర్థి మాజీ యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. తనకు అనుకూలమైన నార్త్ కరోలినాలో మకాం వేశారు. 2016, 2020లలో తనకు మద్దతుగా నిలిచిన ఈ రాష్ట్రంపై ఆయన ఎక్కువగా దృష్టి సారించారు. న్యూమెక్సికో, వర్జీనియాలనూ సైతం డొనాల్డ్ ట్రంప్ సీరియస్‌గా తీసుకున్నారు. డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తుఫాన్ కారణంగా నార్త్ కరోలినా పశ్చిమ ప్రాంతంలో తీవ్ర నష్టం జరిగింది. దీంతో ఈ ప్రాంత ఓటర్లు ఎటు వైపు మొగ్గుతారనే దానిపై సందిగ్ధత నెలకొంది. శుక్రవారం నాటికి నార్త్ కరోలినాలో 78 లక్షలమంది ఓటు వేశారు. మరోవైపు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష అభ్యర్ధిగా మూడోసారి బరిలో నిలిచారు. అందులో మొదటిసారి అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే.. రెండోసారి జో బైడెన్ చేతిలో ఓడిపోయారు. తొలిసారి 2016లో డెమొక్రాటిక్ అభ్యర్ధి హిల్లరీ క్లింటన్ ను ఓడించి అధ్యక్షుడు అయ్యారు. అప్పటి ఎన్నికల్లో పాపులర్ ఓటులో నెగ్గినా.. కానీ ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఎలక్ట్రోరల్ కాలేజీలో మాత్రం ఓడిపోయారు. అప్పట్లో ట్రంప్ కంటే హిల్లరీ క్లింటన్ కు 30 లక్షల ఓట్లు అధికంగా వచ్చాయి.
అమెరికాలో 1984లో ఫస్ట్ టైమ్ డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్దిగా బరిలో నిలిచారు కానీ ఓడిపోయారు. ఆ తర్వాత హిల్లరీ క్లింటన్.. తాజాగా కమలా హారీస్ అధ్యక్ష రేసులో ఉన్నారు. మరి ఈ సారైన కమలా హారీస్ అధ్యక్షురాలిగా ఎన్నికై చరిత్ర సృష్టిస్తారా అనేది చూడాలి.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.