Thandel - Naga Chaitanya: అక్కినేని మూడో తరం నట వాసుడు నాగ చైతన్య హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘తండేల్’. చైతూ కెరియర్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగ చైతన్ సరసన సాయి పల్లవి నటిస్తోంది. లవ్ స్టోరీ తర్వాత వీళ్లిద్దరి కలయికలో వస్తోన్న చిత్రం. మరోవైపు సవ్యసాచి తర్వాత చైతూ, చందూ కాంబోలో వస్తోన్న చిత్రం. అంతేకాదు ఈ సినిమా విడుదలకు ముందే థియేట్రికల్ గా, డిజిటల్, శాటిలైట్ పరంగా మార్కెటింగ్ పూర్తి చేసుకొంది. నాగచైతన్య కెరీర్ లో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని అక్కినేని అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు, టీజర్, పోస్టర్లు ఈ సినిమాపై అంచనాలు పెరిగేలా చేసింది. అంతేకాదు పూర్తి కథా బలంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు కథను కార్తీక్ తీడా అనే రచయిత అందించారు.
దాదాపు 70% షూటింగ్ పూర్తి చేసుకున్న ‘తండెల్’ సినిమా ఇప్పుడు చివరి షెడ్యూల్ కోసం శ్రీకాకుళంలో వెళ్లింది. అక్కడ ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ కథ నేపథ్యం శ్రీకాకుళం ప్రాంతంలో జరిగిన రియల్ స్టోరీ కాబట్టి గత 2,3 రోజుల నుంచి రియల్ లొకేషన్స్ లో చిత్రీకరణ జరుపుతున్నారు. 2018 లో జరిగిన రియల్ కథను శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన రచయిత కార్తీక్ తీడా ఎంతో రీసెర్చ్ చేసి ఈ కథను రాసుకున్నారు. ఫిషర్ మాన్స్ తో 2, 3 నెలలు స్వయంగా ఉండీ, వాళ్లతోనే తింటూ, వాళ్లలో ఒకడిలా కలిసిపోయి, వారితో ప్రయాణం చేస్తూ వారి జీవన శైలీని పూర్తిగా తెలుసుకొని ఈ సినిమా కథను రెడీ చేసాడట.
సముద్రంలో వాళ్లకు ఎదురయ్యే సవాళ్లు, కస్టమ్స్ తో వాళ్లకున్న కష్టాలు,నష్టాలు.. సవాళ్లు..ప్రతి సవాళ్లు.. అన్నింటినీ ఈ సినిమాలో చూపించబోతున్నారట. అలా రాజు, బుజ్జిల కథను అత్యద్భుతంగా, సినిమాటిక్ విజన్ తో తీర్చిదిద్దారు. గీత ఆర్ట్స్ బ్యానర్ లో స్టోరీని వినిపించగా కథ నచ్చడంతో ఇప్పుడు కార్య రూపం దాల్చింది. రచయిత కార్తీక్ తీడా ప్రముఖ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దగ్గర పలు సినిమాలకు అసిస్టెంట్ గా పని చేశారు. ఈ తరుణంలోనే శ్రీకాకుళంలో జరిగిన యదార్ధ సంఘటనను సినిమాగా రాయాలి అనే సంకల్పంతో తండెల్ కథను రాసారు. ఈ చిత్రంలో రాజుగా నాగచైతన్య నటిస్తుండగా.. ఆయనకు జోడిగా బుజ్జి పాత్రలో సాయి పల్లవి కనిపించబోతుంది.ఈ చిత్రంతో నాగచైతన్య కెరియర్ బీఫోర్ తండేల్ ఆఫ్టర్ తండేల్ గా ఉండబోతుందన్న వైబ్స్ కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ రైట్స్ 5 భాషలకు కలిపి రూ. 40 కోట్లకు అమ్ముడుపోయినట్టు సమాచారం.
Also Read: Saurabh Netravalkar: మనోడే అనుకుంటే ముంచేసేలా ఉన్నావే.. ఇండియాకు వచ్చేయ్ బ్రో.. ఆ బౌలర్‌కు పిలుపు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.