4th Phase Lok Sabha Polls 2024: నాల్గో దశలో భాగంగా తెలంగాణ, ఏపీ సహా దేశ వ్యాప్తంగా 96 లోక్ సభ స్థానాలకు ప్రారంభమైన పోలింగ్..

4th Phase Lok Sabha Polls 2024: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాల్గో విడత భాగంగా తెలంగాణలోని 17, ఏపీలో 25 సహా దేశ వ్యాప్తంగా 96 లోక్ సభ నియోజకవర్గాలుకు పోలింగ్ ప్రారంభమైంది.

Written by - TA Kiran Kumar | Last Updated : May 13, 2024, 07:15 AM IST
4th Phase Lok Sabha Polls 2024: నాల్గో దశలో భాగంగా తెలంగాణ, ఏపీ సహా దేశ వ్యాప్తంగా  96 లోక్ సభ స్థానాలకు ప్రారంభమైన పోలింగ్..

4th Phase Lok Sabha Polls 2024: దేశంలోని 543 స్థానాలకు ఎలక్షన్ కమిషన్ 7 విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తోంది. 18 లోక్‌సభకు జరగుతున్న ఈ ఎన్నికల్లో దేశానికి కాబోయే ప్రధాన మంత్రి ఎవరనేది నిర్ణయంచే ఎన్నికలు. ఇప్పటికే మూడు విడతలు పూర్తైయింది. నాల్గో విడతలో భాగంగా ఈ రోజు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. కొన్ని
సమస్యాత్మక ప్రాంతాలు మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. సమయం మించిన తర్వాత ఎలక్షన్ బూత్‌లో క్యూలో ఉన్న అందరికీ ఓటు హక్కు కల్పిస్తారు. ఈ సారి ఎన్నికల్లో ఫస్ట్ ఫేజ్‌లో ఏప్రిల్ 18న 102 లోకసభ సీట్లకు ఎన్నికలు పూర్తయ్యాయి. రెండో విడతలో 88 లోక్‌సభ సీట్లు.. మూడో విడతలో 93 సీట్లకు పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. నాల్గో విడతలో భాగంగా ఈ రోజు 96 లోక్‌సభ సీట్లకు పోలింగ్ జరగనుంది. తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలు.. ఏపీలో 25 లోక్ సభ సీట్లతో పాటు.. 175 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు బిహార్‌లోని 5 లోక్‌సభ సీట్లు.. మధ్యప్రదేశ్‌లోని 8 లోక్ సభ నియోజకవర్గాలు.. మహారాష్ట్రలోని 11 లోక్‌సభ సీట్లు.. ఒడిషాలోని 4 లోక్‌సభ సీట్లతో పాటు 28 అసెంబ్లీ స్థానాలకు మొదటి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తర ప్రదేశ్‌లో 13 లోక్‌సభ సీట్లు.. పశ్చిమ బెంగాల్‌లోని 8 లోక్‌సభ సీట్లు.. ఝర్ఖండ్‌లోని 4 లోక్‌సభ సీట్లు.. జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర లోక్‌సభ సీటుకు నాల్గో విడతలో 9 రాష్ట్రాలు.. ఒక కేంద్ర పాలిత ప్రాంతాలకు ఎన్నికలు జరగున్నాయి.

ఈ సారి ఏపీ అసెంబ్లీ బ‌రిలో పులివెందుల నుంచి వై.య‌స్.జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మ‌రోసారి పోటీ చేయ‌నున్నారు. ముఖ్య‌మంత్రిగా ఉంటూ ఈ సీటులో పోటీ చేయ‌డం ఇదే తొలిసారి. మ‌రోవైపు ఏపీ ప్ర‌తిప‌క్ష నేత టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు కుప్పం నుంచి బ‌రిలో ఉన్నారు. అటు జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్.. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ సారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగుపెట్టాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఆంధ్ర ప్రదేశ్‌లో కూట‌మి ఏర్పాటులో కీ రోల్ పోషించారు. ఇక చంద్ర‌బాబు బామ్మర్ధి కమ్ వియ్యంకుడు బాల‌కృష్ణ.. హిందూపూర్ నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా హాట్రిక్ సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. అటు నారా లోకేష్. మంగ‌ళ‌గిరి నుంచి ఎమ్మెల్యేగా ఎలాగైనా గెలవాల‌నే క‌సితో ఉన్నారు. అటు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు.. పురంధేశ్వ‌రి రాజ‌మండ్రి నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఏపీ పీసీసీ అధ్యక్షరాలు వైయ‌స్ ష‌ర్మిలా  ఎంపీగా కడప లోక్‌సభ నుంచి  కాంగ్రెస్ పార్టీ త‌రుపున‌ పోటీ చేస్తున్నారు. ఇక ఉమ్మ‌డి ఏపీ చివ‌రి ముఖ్య‌మంత్రి కిర‌ణ్ కుమార్ రెడ్డి రాజంపేట నుంచి బీజేపీ త‌రుపున బ‌రిలో ఉన్నారు.  అటు బాల‌య్య రెండో అల్లుడు భరత్.. విశాఖ ప‌ట్నం నుంచి ఎంపీగా కూటమి తరుపున బ‌రిలో ఉన్నారు. అటు నగరి నుంచి వైసీపీ తరుపున రోజా ఎమ్మెల్యేగా పోటీ చేస్తోన్న ప్ర‌ముఖులు అని చెప్పాలి.  

తెలంగాణలో సికింద్రాబాద్ నుంచి బీజేపీ త‌రుపున కిష‌న్ రెడ్డి, బీఆర్ఎస్ త‌రుపున ప‌ద్మారావు గౌడ్, కాంగ్రెస్ పార్టీ త‌రుపున దానం నాగేంద‌ర్ లోక్ స‌భ ఎన్నిక‌ల్లో త‌మ ల‌క్‌ను ప‌రీక్షించుకోనున్నారు. అటు క‌రీంన‌గ‌ర్ నుంచి బీజేపీ త‌రుపున బండి సంజ‌య్.. నిజామాబాద్‌లో బీజేపీ త‌రుపున ధ‌ర్మ‌పురి అరవింద్.. మ‌హ‌హూబ్ నగ‌ర్ నుంచి బీజేపీ త‌రుపున డీకే అరుణ.. కాంగ్రెస్ పార్టీ త‌రుపున వంశీ చంద్ రెడ్డి.. బ‌రిలో ఉన్నారు. అటు నాగ‌ర్ క‌ర్నూల్ నుంచి బీఆర్ఎస్ త‌రుపున మాజీ ఐపీఎస్ ఆర్.ఎస్. ప్ర‌వీణ్ కుమార్.. బీజేపీ త‌రుపున భ‌ర‌త్.. కాంగ్రెస్ త‌రుపున మ‌ల్లు ర‌వి పోటాపోటీగా ఎన్నిక‌ల గోదాలో ఉన్నారు. అటు హైద‌రాబాద్ స్థానం నుంచి ఏఐఎంఐఎం తరుపున అస‌దుద్దీన్ ఐదోసారి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆయ‌న‌కు ప్ర‌త్య‌ర్ధిగా బీజేపీ త‌రుపున మాధ‌విల‌తా నువ్వా నేనా అన్న‌ట్టు ఫైట్ ఇవ్వ‌బోతుంది. అటు యూపీలోకి కన్నౌజ్ నుంచి యూపీ మాజీ సీఎం ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్.. వెస్ట్ బెంగాల్ బెహ్రామ్ పూర్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున అధీర్ రంజన్ చౌదరి.. కృష్ణా నగర్ నుంచి వివాదాస్పద మహువా మొయిత్రా మరోసారి టీఎంసీ తరుపున బరిలో ఉన్నారు. అసన్‌సోల్ నుంచి టీఎంసీ తరుపున శతృఘ్న సిన్హా.. ఝర్ఖండ్‌లోని కుంతీ నుంచి మాజీ సీఎం అర్జున్ ముండా బరిలో ఉన్నారు  ఈ సారి ఎన్నికల్లో తెలంగాణ, ఏపీ, మధ్య ప్రదేశ్‌ సహా దక్షిణాది మొత్తానికి ఎన్నికల ప్రక్రియ పూర్తవుతోంది.  అము మే 20న ఐదో దశ.. 25న ఆరో దశ.. 1వ తేదిన ఏడో దశలో ఎన్నికల క్రతువు పూర్తైవుతోంది.  వీరిలో ఎవ‌రి భ‌విత‌వ్యం ఎలా ఉంద‌నేది జూన్ 4న ఎన్నిక‌ల ఫ‌లితాల రోజు వెలుబ‌డ‌నుంది.

నాల్గో విడతతో  దేశ వ్యాప్తంగా 379 స్థానాలకు ఎన్నికల ప్రక్రియ పూర్తవుతోంది. మరో మూడు విడతల్లో 164 ఎంపీ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తంగా ఏడు దశల ఎన్నికల తర్వాత జూన్ 4వ తేదిన ఓట్ల లెక్కింపు ఉంటుంది.  

ఏపీలో 175 శాసనసభ స్థానాలకు 2387 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. 25 లోక్ సభ సీట్లకు 454 మంది పోటి పడుతున్నారు.
ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 2.02 కోట్ల మంది పురుషులు.. 2.1 కోట్ల మంది మహిళలు.. 3421 మంది ట్రాన్స్‌జెండర్స్ ఉన్నారు. అలాగే 68185 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారు.

ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు 2,387 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. 25 లోక్‌సభ స్థానాలకు 454 మంది పోటీ చేస్తున్నారు.
రాష్ట్రంలో మొత్తంగా 4.14 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. వీరిలో 2.02 కోట్ల మంది పురుషులు కాగా.. 2.1 కోట్ల మంది మహిళలు, 3,421 మంది థర్డ్‌ జెండర్‌ ఓటర్లు ఉన్నారు. అలాగే, 68,185 మంది సర్వీస్‌ ఓటర్లు ఉన్నారు.

Also read: Voter Slip: ఓటరు స్లిప్ అందకున్నా నో ప్రాబ్లెమ్, ఇలా సింపుల్‌గా డౌన్‌లోడ్ చేయవచ్చు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x