DSC Notification: ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్, సంక్రాంతి పండుగ తరువాత మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమౌంది. ఈ విషయాన్ని స్వయంగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఎన్ని పోస్టులుంటాయి, ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేయనున్నారనే వివరాలతో నోటిఫికేషన్ ఉంటుంది.
ఏపీ ప్రభుత్వం త్వరలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇప్పటికే ఈ విషయమై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో చర్చించామని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మెగా డీఎస్సీలో ఎన్ని పోస్టులుంటాయి, ఉద్యోగాల భర్తీ విధి విధానాలు త్వరలో వెల్లడి కానున్నాయి. చాలాకాలంగా డీఎస్సీ నోటిఫికేషన్ లేకపోవడంతో నిరుద్యోగ అభ్యర్ధులు నిరాశతో ఉన్నారు. ఈ నోటిఫికేషన్లో భారీగా అంటే10 వేలకు పైగా పోస్టులు భర్తీ చేయనున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా మార్చ్ నాటికి డీఎస్పీ రిక్రూట్మెంట్ పూర్తయ్యేలా షెడ్యూల్ ఉండవచ్చని సమాచారం. మరోపు గ్రూప్ 2 దరఖాస్తుల గడువు తేదీని ఏపీ ప్రభుత్వం జనవరి 17 వరకూ పొడిగించింది. ఆన్లైన్ దరఖాస్తుల్లో ఇబ్బందులు ఎదుర్కోవడంతో గడువు తేదీని ప్రభుత్వం పొడిగించింది. ప్రస్తుతం దరఖాస్తులు స్వీకరిస్తున్న గ్రూప్ 2 నోటిఫికేషన్ ద్వారా 897 పోస్టులు భర్తీ కానున్నాయి.
Also read: TDP-Janasena Manifesto: టీడీపీ-జనసేన మేనిఫెస్టో సిద్ధం, ఇవే ముఖ్యమైన 12 అంశాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook