Sun Transit 2023: గ్రహాలు నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రవేశిస్తూ ఒక్కోసారి యుతి ఏర్పర్చుతుంటాయి. అదే విధంగా సూర్య, బుధ గ్రహాలు కలిసి ఈసారి యుతి ఏర్పర్చడం వల్ల కొన్ని రాశులపై ఊహించని లాభాలు కలగనున్నాయి. ఎక్కడికి వెళ్లినా విజయం సాధిస్తారు.
హిందూమతం ప్రకారం గ్రహాలు వివిధ సమయాల్లో వివిధ రాశుల్లో గోచారం చేస్తుంటాయి. గ్రహాల గోచారం మనిషి జీవితంలో శుభ, అశుభ ఫలితాలను అందిస్తుంది. సూర్యుడిని గ్రహాల రారాజుగా పిలుస్తారు. జూలై 17వ తేదీన సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించాడు. ఆగస్టు 17 వరకూ అంటే నెలరోజులు ఇదే రాశిలో ఉండనున్నాడు. ఈ సందర్భంగా ఏయే రాశులపై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసుకుందాం..
సూర్యుడు రాశి పరివర్తనం ప్రభావం మిధున రాశిపై స్పష్టంగా పడనుంది. ఈ రాశి జాతకులు నెల రోజుల వరకూ చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే సూర్యుడి వేడి మీ ద్వారా ఇతరుల్ని నష్టపరుస్తుంది. మీ మాటపై నియంత్రణ చాలా అవసరం. మాటపై నియంత్రణలో చాలా లాభాలుంటాయి. యవతీ యువకులు చిన్న చిన్న విషయాల్లో పెద్దోళ్లతో వాదనకు దిగకూడదు.
సూర్యుడి మకర రాశిని వదిలి జూలై 17 నుంచి కర్కాటక రాశిలో ప్రవేశించడమే కాకుండా నెలరోజులు ఇదే రాశిలో ఉండటం వల్ల మకర రాశివారిలో కీలకమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి. సూర్యుడి రాశి పరివర్తనంతో మేష రాశి యువకులు జీవితంలో నిబంధల ప్రకారం నడుచుకోవల్సి ఉంటుంది. ఆగస్టు 17 వరకూ సుఖ సంతోషాలతో జీవించే అవకాశం లభిస్తుంది కానీ నిబంధనల్ని మర్చిపోకూడదు. విద్యార్ధులు, యవకులు ఆలస్యం వదిలిపెట్టాలి. పోటీ పరీక్షలకు హాజరవుతుండాలి. ప్రతిరోజూ ఉదయం లేచిన వెంటనే సూర్యుడికి జలం అర్పించాలి.
సూర్యుడు, బుధ గ్రహాల యుతితో వృషభ రాశి యువకుల సామర్ధ్యం వికసిస్తుంది. సామాజిక కార్యక్రమాలపై విశేషమైన ప్రభావం పడుతుంది. మీ ప్రతిభను చూపించేందుకు అవకాశం కలుగుతుంది. కోపాన్ని దిగమింగుకోవాలి. కోపం నిగ్రహించుకుంటే మంచిది. లేకపోతే అన్ని పనుల్లో విఘాతం ఏర్పడుతుంది. మీ ధ్యాసంతా చదువు, పోటీ పరీక్షలపై ఉంచేందుకు ప్రయత్నిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. కష్టాన్ని నమ్ముకుని ముందుకు సాగితే ఆశించిన ఫలితాలుంటాయి.
Also read: Nag Panchami 2023: నాగుల చవితి తేదిలో మార్పులు.. ఎందుకో తెలుసా, ఎప్పుడు జరుపుకోవాలో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook