Most Wanted Monkey Captured By Officials : ఒక కోతిని గ్యాంగ్‌స్టర్‌ని వెంటాడినట్టు వెంటపడటం ఎప్పుడైనా చూశారా ? జంతువును పట్టుకోవడానికి అధికారులు అందరూ పరుగులు తీయడం ఎక్కడైనా చూశారా ? అంతేకాదు.. ఒక కోతిని పట్టుకోవడం కోసం డ్రోన్‌లను కూడా రంగంలోకి దించాల్సి వస్తుంది అని ఎప్పుడైనా ఊహించారా ? లేదు కదా.. కానీ అది నిజంగానే జరిగింది. అవును.. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ని పట్టిస్తే తగిన నగదు బహుమానం అందించడం జరుగుతుంది అని పోలీసులు ప్రకటిస్తారు కదా.. అలా అక్కడ ఒక కోతి తలపై రూ. 21,000 బహుమానం ప్రకటించారు. ఇంతకీ ఆ కోతిని అంత క్రిమినల్ ని చూసినట్టు చూడాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం రండి.
గత రెండు వారాల వ్యవధిలో ఈ కోతి దాదాపు 20 మందిపై దాడి చేసి గాయపరిచింది. ఎవ్వరు ఎదురొస్తే.. వారిపై దాడి చేసి గాయపర్చడం ఈ కోతికి అలవాటైపోయింది. అందుకే ఈ కోతిని ఒక క్రిమినల్ కేటగిరి కింద ట్రీట్ చేయాల్సి వచ్చింది అంటున్నారు అక్కడి అటవీ శాఖ అధికారులు. బుధవారం సాయంత్రం, ఉజ్జయిని నుండి వచ్చిన రెస్క్యూ టీమ్, స్థానిక అధికారులు, అలాగే స్థానికులు కలిసి ఈ కోతిని పట్టుకోవడానికి పెద్ద సెర్చ్ ఆపరేషన్ కొనసాగించాల్సి వచ్చింది. ఎలా అంటే డాన్ సినిమాలో డాన్ ని పట్టుకోవడానికి పోలీసులు పరుగులు పెట్టినట్టు అన్నమాట.
కోతి కదలికలను ట్రాక్ చేయడానికి చివరకు డ్రోన్‌లను కూడా ఉపయోగించారు. గంటల తరబడి శ్రమించిన తర్వాత ట్రాంక్విలైజర్స్ ఉపయోగించి కోతికి మత్తు మందు ఇచ్చారు. అలా ఆ కోతిని బోనులో బంధించి తీసుకెళ్లారు. అటవీ శాఖ సిబ్బంది ఆ కోతిని బోను ఉన్న వాహనం వద్దకు తీసుకెళ్లే క్రమంలో " జై శ్రీ రామ్ " , " జై బజరంగ్ బలి " అంటూ నినాదాలు చేయడం కోతి రూపంలో ఉన్న ఆ జంతువులో వారు దైవ స్వరూపాన్ని చూసుకోవడానికి నిదర్శనంగా నిలిచింది.
ఇది కూడా చదవండి : Couple Romancing On running Bike: కదిలే బైకుపై తిక్కవేషాలు.. తిక్క కుదిర్చిన పోలీసులు
ఆ 2 వారాల పాటు ఆ పట్టణం మొత్తం కోతి భయానికి గజగజా వణికిపోయింది. ఎప్పుడు, ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తుందో అనే భయం వారిలో స్పష్టంగా కనిపించింది. ఈ రెండు వారాల వ్యవధిలో కోతి 20 మందిపై దాడి చేయగా.. అందులో 8 మంది చిన్నారులు కూడా ఉన్నారు. ఇళ్ల పై కప్పులపై కూర్చుని ఇంటి ముందు నుంచి వెళ్లే వారిపై అకస్మాత్తుగా దాడి చేసిన ఘటనలే అధికంగా ఉన్నాయి. దీంతో జనం.. ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్న వారు తమ పిల్లలతో ఇంట్లోంచి బయటికి వెళ్లాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించే పరస్థితి తలెత్తింది. ఆ కోతిని పట్టుకోవడం గగనంగా మారడం వల్లే స్థానిక అధికారులు ఆ కోతిని పట్టిచ్చిన వారికి 21 వేల నగదు బహుమానం ప్రకటించారు. మొత్తానికి ఇప్పుడు ఈ వానరం వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.
ఇది కూడా చదవండి : Angry LOVE King Cobra's: లవ్‌లో ఉన్న నాగు పాములను గెలికాడు.. మూల్యం చెల్లించుకున్నాడు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK