చిత్రం: తురుమ్ ఖాన్లు
నటీనటులు: నిమ్మల శ్రీరామ్, దేవరాజ్ పాలమూర్, అవినాష్ చౌదరి, ఐశర్య ఉల్లింగాల, పులి సీత, విజయ, శ్రీయాంక తదితరులు
రచన-దర్శకత్వం : ఎన్ శివ కల్యాణ్
నిర్మాత: ఎండీ అసిఫ్ జానీ
ఎడిటర్: నాగేశ్వర రెడ్డి బొంతల,
సినేమోటోగ్రఫీర్: అంబటి చరణ్,
సంగీత దర్శకులు: వినోద్ యాజమాన్య, అఖిలేష్ గోగు రియాన్.
నటీనటుల నుంచి సినిమాకు పనిచేసిన టెక్నీషియన్లు, నిర్మాత కూడా కొత్తవారే అయినా తురుమ్ ఖాన్ లు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు రియల్ హీరో బాలీవుడ్ స్టార్ సోనూ సూద్ ముఖ్య అతిథిగా రావడంతో ఈ చిత్రానికి ప్రేక్షకుల్లో రావాల్సినంత హైప్ వచ్చింది. పక్కా తెలంగాణ, మహబూబ్ నగర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 8న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరీ ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.
కథ:
తుపాకుల గూడెం అనే ఊర్లో జరిగే కథ. శంకర్(నిమ్మల శ్రీరామ్) యూత్ లీడర్, మరదలు లలిత (ఐశర్య ఉల్లింగాల)తో కరోనాలో పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. వీరాజ్ బ్రహ్మ(దేవరాజ్ పాలమూర్) అందరూ బ్రహ్మం అని అంటారు. సిటీలో సాఫ్ట్ వేర్, పెళ్లి కాలేదు అని అందరు హెలనా చేసినా తన నోటి దూలతో అందరిని తిడుతూ ఉంటాడు. ఊర్లోకి వచ్చింది మొదలు తాగుడే పనిగా పెట్టుకుంటాడు. తాను కూడా పెళ్లి చేసుకోవాలను కుంటాడు. విష్ణు(అవినాష్ చౌదరి) కాలేజ్ లో లవ్ పద్మతో చిన్న మనస్పర్థతో బ్రేకప్ అవుతుంది. అదే సమయంలో ఊర్లో లాక్ డౌన్ విధిస్తారు. ఆ టైమ్ లో జరుగునున్న శంకర్ పెళ్లి ఆగిపోతుంది. పద్మ, విష్ణులను కలపడానికి స్వప్న సాయం చేస్తుంది. అదే క్రమంలో స్వప్న విష్ణుపై మనసు పడుతుంది. ఇక బ్రహ్మం భారతి(విజయ)తో ఎఫైర్ పెట్టుకోవాలను కుంటాడు. ఈ ముగ్గిరి కథే తురమ్ ఖాన్ లు సినిమా. శంకర్ పెళ్లి ఎందుకు ఆగిపోయింది.? దానికి కారణం ఎవరు.? విష్ణు, పద్మ కలిశారా.? స్వప్న స్టోరీ ఏంటి.? బ్రహ్మం, భారతి ఎఫైర్ ఎంత వరకు దారి తీసింది.? అసులు ఈ ముగ్గురికి ఉన్న సంబంధం ఏంటి.? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
తెలంగాణ నేపథ్యంలో వచ్చే పాటతో టైటిల్స్ పడటంతోనే ప్రేక్షకులను విలేజ్ మూడ్ లోకి తీసుకెళ్లారు. శంకర్ పెళ్లి హాడవిడితో కథ మొదలు అవుతుంది. మొదటి ముగ్గురి హీరోల క్యారెక్టర్లు ఇంట్రడక్షన్ లతో కథ పార్లల్ గా నడుస్తుంది. ముఖ్యంగా విలేజ్ బ్యాగ్ డ్రాఫ్ లో కథ కాబట్టి చాలా సహజంగా తెరకెక్కించారు. మన ఊర్లో జరిగే కథను చూసిన అనుభూతి కలుగుతుంది. ఇక కరోనా సమయంలో లాక్ డౌన్ పెట్టినప్పటి రోజులను ఈ సినిమా గుర్తు చేస్తుంది. ఆద్యాంతం కామెడీతో ఫన్ని డైలాగ్ లతో ప్రేక్షకులు కడుపుబ్బ నవ్వుకుంటారు. సినిమాలో శంకర్, బ్రహ్మం ఇద్దరు టామ్ అండ్ జెర్రిలా ఎత్తులు, పై ఎత్తులతో ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది కథ. 133 నిముషాలు నిడివి ఉన్న ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు నవ్వులే నవ్వులు. ఫస్ట్ ఆఫ్ చాలా హూషారుగా సాగిపోతుంది. సెకండ్ కాస్త నెమ్మదించిన మళ్లీ అదే జోరులో సాగుతుంది. ఇంటర్వేల్ సీన్ చాలా ఉత్కంఠబరితంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక క్లైమాక్స్ చూసిన తరువాత తృప్తిగా ఒక వింధు భోజనం చేసిన ఫీలింగ్ కలుగుతుంది.
Also Read: Jawan Movie Review: షారుక్ 'జవాన్' సినిమా హిట్టా? ఫట్టా?
ఎవరెలా చేశారు:
నటీనటులు అందరూ కొత్తవాళ్లే అయినా సినిమా చూస్తున్నంత సేపు వాళ్లతో ట్రావెల్ అవుతుంటాము. సినిమాలో శంకర్ పాత్ర చేసిన శ్రీరామ్ నిమ్మల చాలా మెచ్చూడ్ గా నటించారు. అలాగే జబర్దస్థ్ ఐశర్య తన అందం, అభినయంతో కట్టిపడేసింది. బ్రహ్మం పాత్రలో దేవరాజ్ పాలమూర్ జీవించేశాడు. అసలు ఆయన రియల్ గా కూడా ఇలానే ఉంటాడేమో అనేంత సహజంగా చేశారు. ఇక భారతి తన స్క్రీన్ స్పేస్ లో అలరించింది. ఎమోషనల్ గా చెప్పే డైలాగులు ఆకట్టుకుంటాయి. విష్ణుగా అవినాశ్ చౌదరి బాగా చేశారు. తన పాత్రకు న్యాయం చేశారు. పద్మ పాత్రలో పులి సీత ఉన్నంతలో బాగా చేసింది. ఇక షేట్ క్యారెక్టర్, బుగ్గ, ట్రాక్టర్ డ్రైవర్, అలాగే బ్రహ్మం తండ్రి పాత్ర చేసిన వారు కూడా మంచి నటనను కనబరిచారు.
సాంకేతిక విభాగం:
చిత్ర దర్శకుడు ఎన్ శివ కళ్యాణ్ కొత్తవాడైనప్పటికీ ఎంతో అనుభవం ఉన్న డైరెక్టర్ ల కథను హ్యాండిల్ చేసిన విధానం ఆకట్టుకుంది. తాను రాసుకున్న కథను ప్రేక్షకుడు ఆధ్యాంతం ఎంటర్టైన్ అయ్యేలా తీర్చిదిద్దగలిగారు. నటీనటులు కొత్తవాళ్లు అయినప్పటికీ వారి నుండి తనకు కథకు తగ్గట్టుగా నటింపజేయగలడం అది డైరెక్టర్ కే చెల్లుద్ది. సినిమాకు ముఖ్యమైన బలం నేపధ్య సంగీతం. సిచువేషన్ కు తగ్గట్టుగానే పాటలు అద్భుతంగా ఉన్నాయి. కొన్ని కొన్ని సీన్లను నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లడంలో నేపథ్య సంగీతం బాగా ఉపయోగపడింది. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే ఫస్ట్ అఫ్ లో షార్ప్ గా పనిచేసిన నాగేశ్వర్ రెడ్డి బొంతల సెకండ్ హాఫ్ లో తన కత్తెరకు ఇంకాస్త పదులు పెట్టి ఉంటే చాలా బాగుండేది. మొత్తానికి ఎడిటర్ గా తన పని అద్భుతంగా నిర్వర్తించారు అని చెప్పవచ్చు. సినిమాటోగ్రాఫర్ అంబటి చరణ్ పల్లే నేపథ్యంలో సాగే కథను ఏ విధంగా చూపించాలో అదేవిధంగా చూపించి తన పనితనాన్ని కనబరిచారు. ఇక ఫైనల్ గా సినిమాను నిర్మించిన ఎండి ఆసిఫ్ జానీ తురుమ్ ఖాన్ లు తెరకెక్కించడంలో ఎక్కడ వెనకడుగు వేయకుండా, మంచి ప్రొడక్షన్ తో రూపొందించారు. ఇది చిన్న సినిమా అని ఎక్కడ అనిపించదు అంటే దానికి కారణం ప్రొడక్షన్ వ్యాల్యూస్ అని చెప్పవచ్చు.
ప్లస్ లు:
కథా నేపథ్యం
సంగీతం
కామెడీ
రేటింగ్: 2.7/5
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook