Egg White Vs Yellow Egg For Hairfall Control: గుడ్లలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఖనిజాలు కూడా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం అయితే గుడ్డును హెయిర్ మాస్క్ రూపంలో వినియోగిస్తాం. అయితే, ఎల్లో ఎగ్ లేదా వైట్ ఎగ్ రెండిట్లో ఏ భాగాన్ని జుట్టు పెరుగుదలకు ప్రేరేపిస్తుంది. చాలామందిలో ఉన్న అనుమానం ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.. కొంతమంది హెయిర్ మాస్క్ తయారు చేసుకునేటప్పుడు ఎగ్ వైట్ మాత్రమే ఉపయోగిస్తారు. మరి కొంత మంది గుడ్డు మొత్తాన్ని వాడి హెయిర్ మాస్క్ తయారు చేస్తారు. అయితే రెండిటిలో ఏది ఉపయోగించడం వల్ల హెయిర్ ఫాల్ సమస్యకు చక్కని రెమిడీ.
గుడ్డులో విటమిన్స్, మినరల్స్, కొవ్వు ఆసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టు కుదుళ్ల నుంచి మంచి పోషణ అందిస్తుంది. ముఖ్యంగా ఇందులో బయోటిన్ ఉంటుంది.. దీన్ని బీ7 అని కూడా పిలుస్తారు. ఇవి హెయిర్ ఫాలికల్స్ బలంగా మార్చి.. ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు ప్రేరేపిస్తుంది. దీంతో మన జుట్టు రాలకుండా పెరుగుతూనే ఉంటుంది. ఇక పచ్చ భాగంలో విటమిన్ ఏ, విటమిన్ డి ,విటమిన్ ఇ ఉంటుంది. ఇది కూడా జుట్టు పెరుగుదలకు ప్రేరేపిస్తాయి. ముఖ్యంగా కుదుళ్లకు రక్త సరఫరాను మెరుగు చేస్తుంది. దీంతో పొడిబారే సమస్య తగ్గుతుంది. డాండ్రఫ్ మన దరిదాపుల్లోకి కూడా రాదు. తద్వార హెయిర్ ఫాల్ సమస్యకు చక్కని రెమిడీ.
ఇందులో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ లోతుగా మాయిశ్చర్ అందిస్తుంది. ఇది పొడిబారే సమస్యలకు ఎఫెక్టివ్ రెమిడీ. జుట్టు కుదుళ్ల నుంచి బలంగా మారుస్తుంది. జుట్టు రాలే సమస్య కూడా రాదు. మంచి పోషక గుణాలు ఉంటాయి. ఇందులో ఆరోగ్య ప్రయోజనాలు మెండు. జుట్టు కుదుళ్ల నుంచి బలంగా మార్చి హెయిర్ ఫాల్ రాకుండా నివారిస్తుంది.. ఈ గుడ్డులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. సహజ సిద్ధంగా మన జుట్టుకు మెరుపును అందిస్తుంది. ఈ గుడ్లను మన డైట్ లో చేర్చుకోవడం వల్ల కూడా హెయిర్ కేర్ రొటీన్ లో హెయిర్ ఫాల్ సమస్య రాదు జుట్టు బలంగా మారుతుంది.
కుదుళ్లపై ఉండే అదనపు నూనెను గ్రహించే గుణం ఎగ్ వైట్‌కు ఉంటుంది. దీంతో స్కాల్ప్ ఆరోగ్యంగా మారుతుంది.. హెయిర్ ఫాలికల్స్ డ్యామేజ్ కాకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అంతేకాదు ఈ వైట్ ఎగ్ బలహీనంగా ఉన్న జుట్టును బలంగా మారుస్తుంది. రెండూ ఎగ్ ఎల్లో, ఎగ్ వైట్ జుట్టుకు మంచి పోషణ అందిస్తాయి. ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి..
ఎల్లో ఎగ్ హెయిర్ మాస్క్ తయారీ విధానం..
ముందుగా ఎగ్ బ్రేక్ చేసి ఎల్లో వేరు చేయాలి. దీన్ని బాగా కలిపి జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేయాలి. ఓ అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో హెయిర్ వాష్ చేసుకోవాలి. ఈ హెయిర్ మాస్క్ కనీసం వారంలో ఒకసారి ఉపయోగించిన మంచి ఫలితాలు లభిస్తాయి.
ఎగ్ వైట్ హెయిర్ మాస్క్..
గుడ్డు పగులకొట్టి వైట్ ఎల్లోని వేరు చేయాలి. వైట్ ఎగ్ తీసుకొని దాన్ని బాగా బీట్ చేసి కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేయాలి.. ఓ 20 నిమిషాల పాటు అలాగే ఉంచి చల్ల నీరు లేదా గోరువెచ్చని నీటితో హెయిర్ వాష్ చేసుకోవాలి. ఇది ఆయిలీ స్కిల్ ఉన్నవారికి చక్కని రెమిడీ.
రెండిటిని కలిపి కూడా హెయిర్ మాస్క్ తయారు చేసుకోవచ్చు. వీటిని ఆలివ్ ఆయిల్ లేదా తేనెలో వేసి జుట్టు అంతటికి అప్లై చేయడం వల్ల మంచి పోషణ అందించడంతోపాటు చుట్టూ జుట్టు మాయిశ్చర్ నిలుపుకుంటుంది.. చుండ్రు దూరంగా ఉంటుంది ఈ మాస్క్ పెట్టుకోవాలి.
ఇదీ చదవండి: రోజ్ వాటర్ ఇలా వాడితే ముఖం కాంతివంతం.. జుట్టుకు రెండురెట్ల బలం..
రెండిటిలో ఏది బెట్టర్?
ఈ రెండిటిలో ఏది బెట్టర్ అంటే మీరు జుట్టు పెరుగుదల ఆరోగ్యంగా పెరగాలి.. మంచి పోషణ అందాలి అనుకుంటే ఎల్లో ఎగ్ ఉపయోగించండి. ఇందులో విటమిన్స్, మినరల్స్, బయోటిన్, ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి .హెయిర్ ఫాల్ సమస్య రాకుండా నివారిస్తుంది.
డ్యామేజ్ అయిన జుట్టు కావాలి. అంటే ఎగ్ వైట్ ని ఉపయోగించండి ఇందులో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. ఇది త్వరగా ఆయిల్‌ను గ్రహిస్తుంది. దీంతో స్కాల్ప్ బలంగా ఉంటుంది. ఆరోగ్యంగా పెరుగుతుంది జుట్టు. హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో బయోటీన్, ఖనిజాలు ఉంటాయి. సహజ సిద్ధంగా మంచి పోషణ అందిస్తుంది. జుట్టు బలంగా మారిపోతుంది.
ఇదీ చదవండి: జంక్ ఫుడ్ బదులు.. గుప్పెడు సన్‌ఫ్లవర్ సీడ్స్ తింటే మీ గుండె గట్టిదవుతుంది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter