Dragon Fruit For Weight Loss: డ్రాగన్ ఫ్రూట్ శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే బాడికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. దీని శాస్త్రీయ నామం హిలోసెరస్ అని అంటారు. ఇది మన దేశంలో కంటే ఇరత దేశాల్లో ఎక్కువగా లభిస్తాయి. భారతీయులు డ్రాగన్ ఫ్రూట్‌ను లాటిన్ అమెరికా దేశాల నుంచి ఎగుమతి చేసుకుంటారు. అయితే వీటిని ప్రతి రోజూ తీసుకోవడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
డ్రాగన్ ఫ్రూట్ ప్రయోజనాలు ఇవే:
డ్రాగన్ ఫ్రూట్స్ రెండు రకాలుగా ప్రస్తుతం మార్కెట్‌లో లభిస్తున్నాయి. ఒకటి తెలుపు రంగుకు చెందిన జాతైతే.. మరోకటి ఎరుపు రంగుకు చెందింది డ్రాగన్ ఫ్రూట్. ఇందులో ఫినాలిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్, ఆస్కార్బిక్ యాసిడ్, ఫైబర్ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వీటిని ప్రతి రోజూ తినడం వల్ల శరీరానికి ఈ కింది ప్రయోజనాలు కలుగుతాయి.
1. డయాబెటిస్:
మధుమేహంతో బాధపడుతున్నవారు ప్రతి రోజు డ్రాగన్ ఫ్రూట్‌ను ప్రతి రోజూ తినాల్సి ఉంటుంది. అయితే దీనిని తినడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా చాలా రకాల అనారోగ్య సమస్యలకు ఔషధంగా సహాయపడుతుంది.
2. రోగనిరోధక శక్తి పెంచుతుంది:
శీతాకాలం కారణంగా చాలా మంది రోగనిరోధక శక్తిని సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి నిపుణులు సూచించి యాంటీవైరల్ లక్షణాలు అధికంగా ఉండే డ్రాగన్ ఫ్రూట్ ప్రతి రోజూ తినాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని నివారిస్తుంది.
3. జుట్టు ఆరోగ్యంగా ఉంచుతుంది:
డ్రాగన్ ఫ్రూట్‌లో ఉండే పోషకాలు జుట్టు, చర్మ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. డ్రాగన్ ఫ్రూట్‌లో ఫ్యాటీ యాసిడ్స్ గుణాలు అధికంగా ఉంటాయి. జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి కీలక పాత్ర పోషిస్తుంది.
4. జీర్ణక్రియ:
ఒలిగోశాకరైడ్స్ అనే రసాయనాలు డ్రాగన్ ఫ్రూట్‌లో అధికంగా లభిస్తాయి. కాబట్టి దీనిని ప్రతి రోజూ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
Also Read: Veera Simha Reddy Review : వీర సింహా రెడ్డి రివ్యూ.. మెప్పించిన బాలయ్య, నొప్పించిన గోపీచంద్
Also Read: Vaarsudu Telugu Movie Review : విజయ్ వారసుడు రివ్యూ.. వంశీ పైడిపల్లి ఇక మారడు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి