New Tax Benefits: జీరో ట్యాక్స్ విదానం, కొత్త రూల్స్ ప్రయోజనాలు ఎప్పటి నుంచి

New Tax Benefits: కేంద్ర బడ్జెట్‌లో వేతన జీవులకు భారీ ఊరట లభించింది. 12 లక్షల ఆదాయం వరకూ జీరో ట్యాక్స్ విధానం అమల్లోకి వచ్చింది. అయితే ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందో తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 2, 2025, 02:10 PM IST
New Tax Benefits: జీరో ట్యాక్స్ విదానం, కొత్త రూల్స్ ప్రయోజనాలు ఎప్పటి నుంచి

New Tax Benefits: కేంద్ర బడ్జెట్ 2025 లో ఇన్‌కంటాక్స్ కొత్త విధానం ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈసారి బడ్జెట్‌లో ట్యాక్స్ పేయర్లకు బిగ్ రిలీఫ్ లభించింది. స్టాండర్డ్ డిడక్షన్‌తో కలిపి 12.75 లక్షల ఆదాయ వర్గాలకు జీరో ట్యాక్స్ ప్రకటించింది. అంతేకాకుండా టీడీఎస్ మినహాయింపులు ఇతర ప్రయోజనాలున్నాయి. అయితే ఈ మార్పులు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి, ఎప్పుడు లబ్ది చేకూరుతుందనేది పరిశీలిద్దాం.

12 లక్షల వరకూ ఆదాయంపై జీరో ట్యాక్స్ విధానం ఏప్రిల్ 2025 నుంచి అమల్లోకి వస్తుంది. కొత్త ట్యాక్స్ విధానం 2025-26 ఆర్ధిక సంవత్సరం నుంచి అమల్లోకి వస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వచ్చే జీతభత్యాలపై ఈ ప్రభావం పడనుంది. అంటే 2025-26 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన ఐటీ రిటర్న్స్ 2026లో ఫైల్ చేసేటప్పుడు ఇది వర్తిస్తుంది. దీనికి సంబంధించిన ఇతర ప్రయోజనాలు 2026-27 అసెస్‌మెంట్ ఇయర్ నుంచి అందుబాటులోకి వస్తాయి. అంటే ఈ ఏడాది 2025 జూలైలో ఫైల్ చేసే ఐటీ రిటర్న్స్‌కు కొత్త ట్యాక్స్ మినహాయింపులు వర్తించవు.

కొత్త ట్యాక్స్ విధానం ఎవరికి వర్తిస్తుంది

అయితే కేంద్ర బడ్జెట్ 2025లో ప్రకటించిన కొత్త ఇన్‌కంటాక్స్ విధానంలో ట్యాక్స్ మినహాయింపులు న్యూ ట్యాక్స్ రెజీమ్‌లో ఉన్నవారికే వర్తిస్తుంది. పాత పన్ను విధానంలో ఉన్నవారికి వర్తించదు. ప్రతి ఏటా ఆర్ధిక సంవత్సరం అనేది ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు ఉంటుంది. అంటే 2025-26 ఆర్ధిక సంవత్సరం అంటే ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి వచ్చే ఏడాది మార్చ్ 31 వరకూ ఉటుంది. దీనికి సంబంధించిన ఐటీ రిటర్న్స్ అనేవి వచ్చే ఏడాది జూలైలో సమర్పించాల్సి ఉంటుంది. 

Also read: Income Tax vs Salary Hike: కొత్త ఇన్‌కంటాక్స్ ప్రభావం, పెరగనున్న ఉద్యోగుల జీతాలు

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News