Union Budget 2025 Tax Slabs: కేంద్ర ఆర్ధిక మంత్ర నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2025 ఇన్‌కంటాక్స్ వర్గాలకు భారీ ఉపశమనం ఇచ్చింది. మఖ్యంగా మధ్య తరగతి ఉద్యోగవర్గాలకు బిగ్ రిలీఫ్ అని చెప్పవచ్చు. స్థూలంగా పరిశీలిస్తే 12 లక్షల ఆదాయం దాటినవారికి కూడా ప్రయోజనమేనని తెలుస్తోంది.
కేంద్ర ఆర్ధిక బడ్జెట్‌లో మధ్య తరగతి ప్రజలకు బంపర్ బహుమతి లబించింది. ఏడాదికి 12 లక్షల వరకూ ఆదాయం ఉన్నవారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఏడాదికి 12 లక్షల ఆదాయం ఉన్నవాళ్లు ఇప్పటి వరకూ 71,500 రూపాయలు చెల్లించేవారు. అయితే కొత్త స్లాబ్ ప్రకారం ఇప్పుడు ఎలాంటి పన్ను లేదు. చాలామంది 12 లక్షల ఆదాయవర్గాలకే ప్రయోజనం కలుగుతుందని భావిస్తున్నారు. కానీ స్థూలంగా పరిశీలిస్తే 12 లక్షల ఆదాయం దాటినవారికి సైతం ఈ బడ్జెట్ ప్రయోజనం కల్గిస్తోంది. అదెలాగో తెలుసుకుందాం.
మీ ఆదాయం 13 లక్షలుంటే ఇప్పటి వరకూ 88,400 రూపాయలు ట్యాక్స్ ఉండేది. కానీ ఇప్పుడు కొత్త స్లాబ్ ప్రకారం 66,300 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. అంటే నేరుగా 22,100 రూపాయలు లాభపడనున్నారు. ఇక 15 లక్షలు ఆదాయం కలిగినవాళ్లు ఇప్పటి వరకూ 1.330 లక్షలు పన్ను చెల్లించేవారు. కానీ ఇప్పుడు స్లాబ్ మారడంతో 97,500 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. అంటే 32,500రూపాయలు లబ్ది కలగనుంది.
ఇక ఏడాది ఆదాయం 17 లక్షలు ఉంటే ట్యాక్స్ 1 లక్షా 84 వేల రూపాయలుండేది. కానీ ఇప్పుడు 1.30 లక్షలు చెల్లిస్తే చాలు. అంటే ఏకంగా 54,600 రూపాయలు లాభపడనున్నారు. ఇక ఆదాయం 22 లక్షలుంటే ఇప్పటి వరకూ 3,40,600 రూపాయలు కేవలం ట్యాక్స్ చెల్లించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మారిన స్లాబ్ ప్రకారం 2,40500 రూపాయలు చెల్లించాలి. అంటే 1 లక్ష రూపాయలు ప్రయోజనం కలగనుంది. ఇక 25 లక్షలు ఆదాయం ఉన్నవాళ్లు ఇప్పటి వరకూ 4 లక్షల 34 వేల 200 రూపాయలు ట్యాక్స్ చెల్లించాల్సి ఉండేది. కానీ ఇకపై 3 లక్షల 19 వేలు చెల్లిస్తే చాలు. అంటే 1 లక్షా 17 వేల 40 రూపాయలు మిగలనున్నాయి.
Also read: Union Budget 2025 Updates: దేశంలో భారీగా పెరగనున్న ఎంబీబీఎస్ సీట్లు, ఐదేళ్లలో 75 వేల సీట్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి