Prayag raj villgers requested to maha kumbh devotees: ప్రయాగ్ రాజ్ కుంభమేళకు ప్రతిరోజు భక్తులు తరలి వస్తునే ఉన్నారు. జనవరి 13న ప్రారంభమైన ప్రయాగ్ రాజ్ పుణ్యస్నానాలు, ఫిబ్రవరి 26తో ముగియనుంది. ఈ క్రమంలో ప్రస్తుతం మహా శివరాత్రి నేపథ్యంలో ఫిబ్రవరి 26న షాహిస్నానం ఉండనుంది. ఇప్పటికే కుంభమేళకు దాదాపు.. 58 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారని యూపీ సర్కారు ప్రకటించింది.
అయితే.. కుంభమేళకు వచ్చే భక్తుల తాకిడి మాత్రం ఏమాత్రం తగ్గడంలేదు. కుంభమేళలో ప్రస్తుతం కౌంట్ డౌన్ మొదలైంది. ఈ క్రమంలో ప్రయాగ్ రాజ్ స్థానికులు కుంభమేళకు వస్తున్న భక్తులు పెద్ద దండం పెడుతున్నారు. ఇకచాలు మా వల్ల కాదు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కుంభమేళలో ప్రాంభమైనప్పటి నుంచి రైళ్లు, విమానాలు, సొంత వాహానాలు, బస్సులలో ప్రజలు ప్రపంచం నలుమూలల నుంచి వస్తునే ఉన్నారు. దీంతో కుంభమేళ చుట్టుపక్కల ప్రాంతాలన్ని పోలీసుల ఆధీనంలోకి వెళ్లిపోయాయి.
ఎక్కడ కూడా ప్రజలు బైటకువెళ్లి తమ పనులు చేసుకొలేని విధంగా మారిపోయింది. చాలా చోట్ల వాహానాల్ని నిషేధించారు. అంతే కాకుండా.. భక్తులు నిరంతరం వస్తుండటంతో కుంభమేళ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా దుమ్ము ధూళి, కాలుష్యకూపంగా మారిపోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా.. కుంభమేళలో ప్రస్తుతం మరో రెండు రోజుల్లో పుణ్యస్నానాలు ముగియనుండటం నేపథ్యంలో మరింత మంది భక్తులు వచ్చే అవకాశాలు ఉందనికూడా అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే కుంభమేళలో ఫిబ్రవరి 26తో కుంభమేళ ముగుస్తుందని ప్రభుత్వం ప్రకటించింది.
ఈ క్రమంలో దయచేసి కుంభమేళకు ఇక రావొద్దని.. కొన్ని రోజులు తమను తమ పనులు చేసుకొనివ్వాలని కూడా స్థానికులు కుంభమేళ యాత్రికులకు ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ప్రయాగ్ రాజ్ వాసులు.. సోషల్ మీడియాల వేదికగా..తమను వదిలేయాలని.. ఊపిరీ పీల్చుకునే అవకాశం ఇవ్వాలని కూడా పోస్టులు పెడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి