Delhi railway station stampede incident update: దేశ రాజధాని ఢిల్లీలోని రైల్వేస్టేషన్ లో శనివారం రాత్రి భారీ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 18 మంది ఊపిరాడక మరణించారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. అయితే.. ఈ ఘటనకు ముఖ్య కారణం.. ప్రయాణికులంతా ఒకే ప్లాట్ ఫామ్ మీదకు భారీగా వచ్చారు. కుంభ మేళాకు వెళ్లాల్సిన స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్ రాజధాని రైళ్లు ఆలస్యమయ్యాయి. దాని కోసం వేచిస్తున్న ప్రయాణికులు అప్పటికే ప్లాట్ ఫామ్ మీద ఉన్నారు.
బ్రేకింగ్ న్యూస్
ఢిల్లీ రైల్వేస్టేన్లో తొక్కిసలాట.. 18 మంది మృతి
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో నిన్న రాత్రి జరిగిన తొక్కిసలాటలో 18 మంది మరణించగా, పదుల సంఖ్యలో జనాలు గాయాలు
మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం
తీవ్ర గాయాలైన వారికి రూ.2.5 లక్షల చొప్పున పరిహారం… pic.twitter.com/0ggpw1wLgl
— Telugu Scribe (@TeluguScribe) February 16, 2025
ఈ క్రమంలో.. ప్రయాగ్‌రాజ్‌కు మరో ప్రత్యేక రైలు ఏర్పాటు చేసినట్లు రైల్వే శాఖ అనౌన్స్ చేసింది. దీంతో ప్రయాణికులు ప్లాట్ ఫామ్ 13,14,15 ల దగ్గర భారీగా చేరుకున్నారు. రైల్వే అధికారుల అనౌన్స్ మెంట్ లో కూడా తీవ్ర గందర గోళం ఏర్పడింది. దీంతో ఒక్కసారిగా ప్రయాణికులు ప్లాట్ ఫామ్ మీదకు రావడంతో అప్పటికే అక్కడ ట్రైన్ కోసం వేచీ చూస్తున్న ప్రయాణికులు ఒకరి మీద మరోకరు పడిపొవడంతో చాలా మంది ఊపిరాడక చనిపోయారు. అయితే.. తొక్కిసలాట ముఖ్యంగా రెండు చోట్ల చోటు చేసుకున్నట్లు ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ప్లాట్ ఫామ్ నెంబర్ 13,14 ల వద్ద, అదే విధంగా ఫ్లాట్ ఫామ్ నెంబర్ 16 కు సమీపంలోని ఎలివేటర్ వద్ద కూడా ప్రయాణికులు భారీగా రావడంతో తీవ్రమైన ఒత్తిడి జరిగి తొక్కిసలాట సంభవించింది. మరోవైపు రైల్వే అధికారులు గంటకు.. 1500 జనరల్ టికెట్లను సైతం విక్రయించినట్లు వెల్లడించారు. దీన్ని బట్టి చూస్తు రైల్వే స్టేషన్ లో ఏమేరకు రద్దీ ఉందో అర్ధం చేసుకొవచ్చు. మరోవైపు చాలా మంది అసలు టికెట్ లు కూడా తీసుకొకుండానే.. రైళ్లలో ప్రయాణిస్తున్నారని సమాచారం.
తొక్కిసలాట ఘటనపై రైల్వే అధికారులు, పోలీసులు ఎవరికి వారు ప్రత్యేకంగా విచారణ చేపట్టారు. అయితే.. వీరి వాదనలు మాత్రం భిన్నంగా ఉన్నాయని చెప్పుకొవచ్చు. అధికారులు పూర్తిగా విచారణ అనంతం తుదినివేదిక వచ్చిన తర్వాత దీనిపై ప్రకటన చేయనున్నారు. మరోవైపు ఈ ఘటనపై పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున పరిహారం.. తీవ్ర గాయాలైన వారికి రూ. 2.5 లక్షల చొప్పున పరిహారం అందివ్వనున్నట్లు ప్రకటించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter