Jamili Elections Report: దేశంలో 2029 నుంచి జమిలీ ఎన్నికలు, సిద్ధమైన నివేదిక

Jamili Elections Report: దేశంలో గత కొద్దికాలంగా జమిలి ఎన్నికల ప్రస్తావన వస్తోంది. జమిలి ఎన్నికల నిర్వహణపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ పరిశీలన పూర్తి చేసింది. త్వరలో నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందించనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 10, 2024, 10:18 AM IST
Jamili Elections Report: దేశంలో 2029 నుంచి జమిలీ ఎన్నికలు, సిద్ధమైన నివేదిక

Jamili Elections Report: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత కొద్దికాలంగా జమిలి ఎన్నికల కోసం సమాలోచన చేస్తోంది. ఇందుకు తగ్గట్టే మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. దాదాపు ఆరు నెలలకు పైగా జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై పరిశీలన జరిపిన కమిటీ తుది నివేదికను త్వరలో కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనుంది. 

జమిలి ఎన్నికలపై సాధ్యాసాధ్యాలు పరిశీలించి తగిన సూచనలు, విధివిధానాలు, మార్గదర్శకాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం 2023 సెప్టెంబర్ నెలలో మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఓ ఉన్నత స్థాయి కమిటీ నియమించింది. ఈ కమిటీ కసరత్తు దాదాపుగా పూర్తయింది. త్వరలో కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది. 2029 నుంచి ఎన్నికల్ని ఒకే సమయంలో నిర్వహించేలా నిబంధనలు మార్చాల్సి ఉంటుందని కమిటీ సూచించనున్నట్టు తెలిపింది. లోక్‌సభ, అసెంబ్లీతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు అన్నింటికీ ఒకే ఉమ్మడి ఓటరు జాబితా ఉండాలనేది ప్రదాన సూచనగా ఉండనుంది.

రాజ్యాంగంలో సవరణలు 

దీనికోసం రాజ్యాంగంలో కనీసం 5 సవరణలు చేయాల్సి ఉంటుంది. పార్లమెంట్ సభల వ్యవధిపై ఆర్టికల్ 83, లోక్‌సభ రద్దుపై రాష్ట్రపతి అధికారాలు ఆర్టికల్ 85, రాష్ట్రాల అసెంబ్లీల వ్యవధికి సంబంధించి ఆర్టికల్ 172, శాసనసభల రద్దుకు సంబంధించి ఆర్టికల్ 174, రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలనకు సంబంధించి ఆర్టికల్ 356  సవరణలు చేయాల్సి ఉంటుంది. 

స్థానిక సంస్థలు, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్ని ఒకేసారి నిర్వహించాలంటే ప్రతి 15 ఏళ్లకు 10 వేల కోట్లు అవసరమౌతాయని కమిటీ అభిప్రాయపడింది. ఎందుకంటే రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, లోక్‌సభ, రాజ్యసభ, అసెంబ్లీ ఎన్నికల్ని కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంటుంది. స్థానిక సంస్థల ఎన్నికల్ని మాత్రం ఆయా రాష్ట్రాల ఎన్నికల సంఘాలు నిర్వహిస్తుంటాయి. అన్ని ఎన్నికల్ని ఒకేసారి నిర్వహించాలంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల కొరత ఏర్పడవచ్చు. ఈ సమస్యను అధిగమించేందుకు భారీగా నిధులు అవసరమౌతాయి

మరోవైపు రిటైర్డ్ జస్టిస్ రుతురాత్ అవస్థి నేతృత్వంలోని న్యాయ కమీషన్ కూడా జమిలీ ఎన్నికలపై కీలకమైన సిఫార్సులు ఇవ్వనుంది. ఏకకాల ఎన్నికల నిర్వహణకై రాజ్యాంగంలో కొత్త ఛాప్టర్ ఏర్పాటు చేయాలని సూచించనుంది. 

Also read: Timesnow ETG Survey: ఈసారి ఏపీలో అధికారం ఎవరిది, తేల్చేసిన టైమ్స్ నౌ-ఈటీజీ తాజా సర్వే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News