Old Pension Scheme Soon: మారిన విధానాల కారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పింఛన్ విధానం అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. కొత్త పింఛన్ పథకం అమలుతో ఆర్థిక ప్రయోజనాలు చాలా తక్కువగా వస్తున్నాయి. ఓపీఎస్ అమలుతో ఉద్యోగులకు లబ్ధి తగ్గిపోవడంతో దేశవ్యాప్తంగా ఈ విధానంపై ఉద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఓపీఎస్ వద్దు.. పాత పింఛన్ ముద్దు అంటూ దేశవ్యాప్తంగా ఉద్యమం కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా పాత ఫించన్ పథకం అమలు చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఓపీఎస్ అమలులో ప్రక్రియ ప్రారంభమైందని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ ప్రకటించారు.
Also Read: Govt Holiday: విద్యార్థులు, ఉద్యోగులకు శుభవార్త.. ఇకపై ప్రతి నెల నాలుగో శనివారం సెలవు
బెంగళూరులో ఉద్యోగ సంఘాలతో జరిగిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆఫీస్ బేరర్లు తమ సమస్యలను మంత్రికి వివరించారు. ఈ క్రమంలో ఓపీఎస్‌పై కూడా చర్చించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ అయిన ఓపీఎస్ విషయాన్ని ఉద్యోగులు ప్రస్తావించారు. మేనిఫెస్టోలో కూడా పెట్టారని గుర్తుచేశారు. ఉద్యోగుల డిమాండ్లను విన్న డిప్యూటీ సీఎం శివకుమార్ కీలక ప్రకటన చేశారు.
Also Read: Boycott OYO: మరో వివాదంలో 'ఓయో రూమ్స్'.. ట్రెండింగ్‌లో 'బాయ్‌కాట్ ఓయో'
'పాత పింఛన్ పద్ధతి అమలుపై రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటుంది. అంజుమ్ పర్వేద్ చైర్మన్‌గా వేసిన కమిటీ అధ్యయనం చేసిన అనంతరం ఓపీఎస్‌పై చర్యలు తీసుకుంటాం. ఓపీఎస్ అమలుకు తప్పనిసరిగా కావాల్సిన చర్యలు ప్రభుత్వం చేపడుతుంది. కమిటీ నివేదికను అధ్యయనం చేస్తాం. ఎన్నికల సందర్భంగా మా పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన ఓపీఎస్ అమలు చేసే బాధ్యత మాది' అని డీకే శివకుమార్ ప్రకటించారు. 'మేం తప్పకుండా చేస్తాం. కానీ సమయం.. ఓపిక అవసరం' అని పేర్కొన్నారు.
ఉద్యోగులు పూజారుల్లాంటివారు
'ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అత్యుత్తమ సేవలు అందిస్తోంది. ప్రభుత్వం బాధ్యతతో చేస్తున్న పనులు ఉద్యోగులు సహకరించాల్సి ఉంది. ఉద్యోగులు అనేవారు గుడిలో పూజారుల్లాంటి వారు. ప్రజలకు ఏం కావాల్సిందో పూజారులు నేరుగా దేవుడి వద్ద చెప్పుకోవాల్సి ఉంది. నేను కూడా 38 సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగిగా పని చేస్తున్నా' అని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వెల్లడించారు. ప్రజాప్రతినిధులు.. ప్రభుత్వ ఉద్యోగులు ఇద్దరూ ఒక్కటే అని స్పష్టం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.