ఇండియాలో మరో భారీ ఉగ్రదాడికి కుట్ర జరిగింది. 26/11 ఉగ్రదాడికి 12 ఏళ్లు పూర్తయిన నేపధ్యంలో మరో భారీ దాడికి ప్రయత్నించినట్టు నగ్రోటా ఎన్ కౌంటర్ సమీక్షలో అధికారులు వెల్లడించారు.
జమ్మూ ( Jammu )లో రెండ్రోజుల క్రితం జరిగిన నగ్రోటా ఎన్ కౌంటర్ ( Nagrota Encounter ) పెను సంచలనమైన విషయాల్ని వెలుగులోకి తెచ్చింది. ఈ ఎన్ కౌంటర్పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ( pm narendra modi )..హోంమంత్రి అమిత్ షా ( Home minister Amit shah ), జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ తో సమీక్ష నిర్వహించారు. 26/11 ఉగ్రదాడి ( 26/11 Terror attack ) జరిగి 12 ఏళ్లు పూర్తవుతున్న నేపధ్యంలో మరో భారీ ఉగ్రదాడికి ప్రయత్నించారని అధికారులు సమీక్షలో వెల్లడించారు.
ఈ ఎన్కౌంటర్పై ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ అధికారికి భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సమన్లు జారీ చేసింది. జైష్-ఎ-మహమ్మద్ ఉగ్రవాద దాడిపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్ భూభాగం నుంచి ఉగ్రవాదులకు అందిస్తున్న సాయాన్ని ఉపసంహరించుకోవాలని హెచ్చరించింది. జాతీయ భద్రతను కాపాడుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. మరోవైపు జైెష్ ఎ మొహమ్మద్( Jaish e mohammad ) సంస్థకు చెందిన నలుగురు ఉగ్రవాదుల్ని హతమార్చి..భారీ ఉగ్రదాడి కుట్రను అడ్డుకోవడంపై ప్రధాని మోదీ ట్వీట్ ద్వారా ప్రశంసలు కురిపించారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని..పాకిస్తాన్ ఉగ్రవాదులు చొరబాట్లకు పాల్పడుతున్నారనే సమచారం భద్రతా దళాలకు అందిందని తెలుస్తోంది. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 22 వరకూ జమ్మూలో జరిగే జిల్లా అభివృద్ధి మండలి ఎన్నికల్లో కుట్రకు ప్రణాళిక సిద్ధమైంది. జిల్లాలోని నగ్రోటా పట్టణానికి సమీపంలో హైవేపై ఉన్న టోల్ ప్లాజా వద్ద జరిగిన కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మరణించారు. పెద్దఎత్తున ఆయుధాలు కూడా స్వాధీనమయ్యాయి. Also read: Tamilnadu: గడువుకు ముందే శశికళ విడుదల సాధ్యం కాదా