Hemant Soren: మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు బెయిల్.. మొన్న కేజ్రీవాల్‌.. నేడు సోరెన్‌.. రేపు కవిత?

Jharkhand High Court Grants Bail To Former CM Hemant Soren: జైల్లో మగ్గుతున్న మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ భారీ ఉపశమనం లభించింది. దాదాపు ఆరు నెలల తర్వాత ఆయనకు కోర్టు బెయిల్‌ ఇచ్చింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jun 28, 2024, 01:07 PM IST
Hemant Soren: మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు బెయిల్.. మొన్న కేజ్రీవాల్‌.. నేడు సోరెన్‌.. రేపు కవిత?

Hemant Soren Bail: భూ కుంభకోణం కేసులో అరెస్టయిన జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌కు భారీ ఊరట లభించింది. బెయిల్‌ పిటిషనపై విచారణ చేపట్టిన జార్ఖండ్‌ హైకోర్టు శుక్రవారం బెయిల్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తూ ప్రకటన విడుదల చేసింది. దాదాపు ఆరు నెలల తర్వాత అతడికి బెయిల్‌ లభించింది.

Also Read: Sudha murty: అబ్దుల్ కలాంఫోన్ చేస్తే.. రాంగ్ నంబర్ అని చెప్పా.. వైరల్ గా మారిన ఎంపీ సుధామూర్తి వ్యాఖ్యలు..

 

జార్ఖండ్‌ రాజధాని రాంచీలో 8.86 ఎకాల భూమిని అక్రమ లావాదేవీలు, నకిలీ పత్రాల ద్వారా రికార్డులను తారుమారు చేసి కోట్ల విలువైన భూమిని పొందారని తీవ్ర ఆరోపణలు వచ్చాయి. భూ కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్‌ ముక్తి మోర్చ పార్టీ అధినేతగా ఉన్న హేమంత్‌ సోరెన్‌ను ఈ ఏడాది జనవరి 31వ తేదీన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసినవిషయం తెలిసిందే. అరెస్ట్‌ నాటి నుంచి ఆయన రాంచీలోని బిర్సా ముండా జైలులో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదల కానున్నారు.

Also Read: Lok Sabha Speaker: మూజువాణీ ఓటుతో లోక్ సభ స్పీకర్ గా ఎన్నికైన ఓం బిర్లా..

 

బెయిల్‌ విచారణ సందర్భంగా న్యాయస్థానంలో ఆసక్తికర చర్చ జరిగింది. 'ప్రాథమిక ఆధారాలను చూస్తుంటే ఆయన ఎలాంటి నేరానికి పాల్పడలేదు. బెయిల్‌పై ఉన్నప్పుడు నేరం చేసే అవకాశాలు కూడా లేవని గుర్తించాం. ఈ కారణం చేత ఆయనకు బెయిల్‌ మంజూరు చేస్తున్నాం' అని కోర్టు తెలిపింది. కాగా హేమంత్‌ కుంభకోణం ఆరోపణల కేసులో ఐఏఎస్‌ అధికారి రాంచ మాజీ డిప్యూటీ కమిషనర్‌ చవీ రంజన్‌, భాను ప్రతాప్‌ ప్రసాద్‌ అనే అధికారులతో సహా 25 మందికి పైగా అధికారులు, ఇతరులను ఈడీ అరెస్ట్‌ చేసింది.

బెయిల్‌ కోసం హేమంత్‌ సోరెన్‌ తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ న్యాయస్థానాలు అంగీకరించలేదు. లోక్‌సభ ఎన్నికల సమయంలోనే ప్రచారం కోసం బెయిల్‌ ఇవ్వాలని కోరినా కూడా ఊరట లభించింది. దాదాపు ఆరు నెలల తర్వాత బెయిల్‌ లభించడం గమనార్హం. అతడు విడుదలవడంతో జేఎంఎం పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. కాగా జేఎంఎం పార్టీ ఇండియా కూటమిలో భాగంగా ఉన్న విషయం తెలిసిందే.

నాడు అరెస్ట్‌ సమయంలో హేమంత్‌ సోరెన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సందర్భంగా జరిగిన నాటకీయ పరిస్థితుల్లో హేమంత్‌ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. తన స్థానంలో పార్టీలో సీనియర్‌ నాయకుడిగా ఉన్న చంపాయి సోరెన్‌ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. మొన్న ఆప్‌ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు కూడా బెయిల మంజూరైంది. కానీ తుది నిమిషంలో ఊహించని మలుపు తిరగడంతో ప్రస్తుతం ఆయన జైల్లోనే ఉన్నారు. వరుసగా ప్రతిపక్ష నాయకులకు బెయిల్స్‌ వస్తున్నాయి. త్వరలోనే తెలంగాణ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కూడా బెయిల్‌ వస్తుందనే చర్చ జరుగుతోంది. కాగా ప్రతిపక్ష పార్టీలకు సానుకూల పరిణామాలు చోటుచేసుకుంటుండడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News