India Covid-19: దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు

భారత్‌లో కరోనావైరస్ మహమ్మారి కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గతంలో నమోదైన కోవిడ్ కేసులు, మరణాలతో పోల్చుకుంటే.. ప్రస్తుతం రెండింటి సంఖ్య కూడా స్వల్పంగా నమోదవుతోంది.

Last Updated : Jan 4, 2021, 10:43 AM IST
India Covid-19: దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు

India Coronavirus Latest Updates | న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ మహమ్మారి కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గతంలో నమోదైన కోవిడ్ కేసులు, మరణాలతో పోల్చుకుంటే.. ప్రస్తుతం రెండింటి సంఖ్య కూడా స్వల్పంగా నమోదవుతోంది. శనివారం 18వేల కేసులు నమోదు కాగా.. ఆదివారం 16వేల కేసులే నమోదయ్యాయి. గత 24గంటల్లో (జనవరి 3న) కొత్తగా 16,505 కరోనా కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి కారణంగా 214 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన గణాంకాలతో దేశంలో మొత్తం కరోనా (Corona cases) కేసుల సంఖ్య 1,03,40,470 కి చేరగా.. మరణాల సంఖ్య 1,49,649 కి పెరిగింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ (Health Ministry) సోమవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. 

ఇదిలాఉంటే.. నిన్న కరోనా (Coronavirus) నుంచి 19,557 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న (cured cases) వారి సంఖ్య 99,46,867 కి పెరిగిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో (active cases) 2,43,953 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 96.19 శాతం ఉండగా.. మరణాల రేటు 1.45 శాతం ఉంది. Also Read: Farmers Protest: నేడు ఏడోసారి కేంద్రం, రైతుల మధ్య చర్చలు.. ఫలించేనా?

ఇదిలాఉంటే.. నిన్న దేశవ్యాప్తంగా 7,35,978 కరోనావైరస్ నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) వెల్లడించింది. ఈ టెస్టులతో కలిపి జనవరి 3వ తేదీ వరకు మొత్తం 17,56,35,761 నమూనాలను పరీక్షించినట్లు (samples tested) ఐసీఎంఆర్ వెల్లడించింది.

Also Read: Uttar Pradesh: 25కి చేరిన మృతుల సంఖ్య.. ముగ్గురి అరెస్ట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News