triveni sangam water for across 75 jails 90000 inmates: ప్రయాగ్ రాజ్ కుంభమేళ ముగింపునకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. దీంతో ప్రతి రోజు కుంభమేళకు వస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. జనవరి 13న ప్రారంభమైన కుంభమేళ ఫిబ్రవరి 26 తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 26న మహాశివరాత్రి షాహీస్నానంను నిర్వహించనున్నారు. ఇప్పటికే కుంభమేళలో 56 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారని.. మరికొన్ని రోజులు మిగిలి ఉన్నాయి.. దీని సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని యూపీ సర్కారు ప్రకటించింది.
उन्नाव ज़िला जेल में बंद बंदियों की इच्छा भी कुंभ स्नान की थी। जेल प्रशासन ने एक मटकी में संगम का जल मंगवाया। गंगा मैया के जयकारों के साथ बंदियों से स्नान किया। स्नानार्थियों पर फूल फेंके गए। #Unnao #MahaKumbh2025 #KumbhMela2025 @NBTLucknow pic.twitter.com/otlmDOnt9A
— Praveen Mohta (@MohtaPraveenn) February 18, 2025
ఈ క్రమంలో కుంభమేళకు వస్తున్న వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా.. యూపీ సర్కారు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. అయితే.. సీఎం యోగి ఆదిత్యనాథ్ తనదైన విధంగా మంచి మనసు చాటుకున్నారు. ఎక్కడెక్కడి వాళ్లో కుంభమేళకు వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ క్రమంలో.. యూపీలో జైళ్లో ఉన్న ఖైదీలకు పుణ్యస్నానాలు చేసే విధంగా ఏర్పాట్లు చేస్తే ఎలా ఉంటుందని యూపీ సీఎం యోగి భావించారు.
సాధారణంగా జీవితంలో అనుకొని విధంగా చాలా మంది కొంత మంది తప్పులు చేసి జైళ్లకు వెళ్తుంటారు. కొంత మంది కావాలని చేస్తే, మరికొందరు రెప్పపాటులో ఆవేశంలో దారుణాలు చేసి జైళ్లకు వెళ్తుంటారు. అయితే.. కుంభమేళ నీళ్ల పవిత్ర స్నానం పుణ్యం వారికి కల్గే విధంగా యూపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.
యూపీ వ్యాప్తంగా ఉన్న 75 జైళ్లో ఉన్న దాదాపు.. 99 వేల మంది ఖైదీలకు త్రివేణి సంగమం పుణ్యస్నానం కలిగే విధంగా చర్యలు తీసుకొవాలని అధికారుల్ని ఆదేశించింది. దీనిలో భాగంగా ఇటీవల ఉన్నావ్ జైలు అధికారులు..కుంభమేళ నీళ్లను.. జైలు ఖైదీలు స్నానం చేసే పెద్ద నీటీ తొట్టెలో కలిపారు. దీంతో ఆ నీళ్లన్ని కూడా కుంభమేళ నీళ్లుగా మారిపోయాయి. దీనిలో ఖైదీలంతా కూడా పుణ్యస్నానాలు ఆచరించారు. ఇదే విధంగా యూపీ వ్యాప్తంగా జైలులోకి ఖైదీలంతా పుణ్యస్నానాలు చేసేలా చూడాలని యూపీ సీఎం యోగి ఆదేశించారు. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి