Bihar Assembly Election 2020 - Live Updates | పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly Election ) పోరు తుది దశకు చేరుకుంది. కోవిడ్ నిబంధనల మేరకు అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. మూడో విడత ఎన్నికల్లో (last phase of bihar polls) భాగంగా 15 జిల్లాల్లోని 78 స్థానాల్లో.. అదేవిధంగా ఉపఎన్నిక జరిగే వాల్మీకినగర్ (Balmiki Nagar) లోక్‌సభ నియోజకవర్గంలో కూడా ఈ రోజు ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. అయితే (3rd phase polling) 78 అసెంబ్లీ స్థానాల్లో మొత్తం 1,204 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. దాదాపుగా 2.34 కోట్ల మంది ఓటర్లు తమ హక్కు వినియోగించుకోనున్నారు. వాల్మీకీ నగర్ జేడీ(యూ) ఎంపీ బైద్యనాథ్ మహతా మృతితో ఈ స్థానంలో ఉపఎన్నిక నిర్వహిస్తున్నారు. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో పటిష్టమైన కోవిడ్19 (Coronavirus) నిబంధనలతో అధికారులు పోలింగ్ ఏర్పాట్లను చేశారు. ఓటు వేసేందుకు వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా థర్మల్ స్కానర్లు, హ్యాండ్ శానిటైజర్లను అధికారులు ఏర్పాటు చేశారు.
#WATCH | Bihar: People queue up at polling booth number 195 and 196 in Kishanganj for the third and final phase of #BiharPolls. pic.twitter.com/pxC023Pj22
— ANI (@ANI) November 7, 2020
ఇదిలా ఉంటే.. ఈ ప్రాంతంలో ఎన్డీఏ ( BJP- JDU), మహాఘట్‌బంధన్ ( Congress - RJD - Left), తోపాటు ఎల్జేపీ, ఏఐఎంఐఎం, బీఎస్పీ, ఆర్‌ఎల్‌ఎస్‌పీ కూడా పోటీలో ఉన్నాయి. మూడో విడత ఎన్నికల్లో బహుముఖ పోటీ నెలకొంది. ఈ స్థానాల్లో ప్రస్తుత క్యాబినెట్ మంత్రులు 12 మంది కూడా పోటీలో ఉన్నారు. శరద్ యాదవ్ కూతురు సుభాషిణి యాదవ్ కాంగ్రెస్ నుంచి బీహారీగంజ్ స్థానంలో పోటీ చేస్తుండగా.. మండల్ కమిషన్‌కు నేతృత్వం వహించిన బీపీ మండల్ మనుమడు నిఖిల్ మండల్ జేడీయూ నుంచి మధేపురాలో పోటీలో ఉన్నారు.
- Also Read : Tejashwi Yadav: సీఎం అభ్యర్థికి చేదు అనుభవం
ఇదిలాఉంటే.. బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. మొదటి విడతలో భాగంగా అక్టోబరు 28న 71 స్థానాలకు ఎన్నికలు జరగగా.. రెండో విడతలో నవంబరు 3న 94 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. నేడు మూడో విడతలో భాగంగా 78 స్థానాల్లో ఎన్నికలు జరుతున్నాయి. అయితే 10 తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. Also Read : Bihar Assembly Elections: లాలూ విడుదలైన మరుసటి రోజే సీఎం నితీశ్‌కు వీడ్కోలు: తేజస్వీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe