Old Tax Regime: 'పన్ను చెల్లింపుదారులకు బిగ్‌ అలర్ట్‌! పాత పన్ను విధానం రద్దు లేదు'

Really Old Tax Regime Will Discontinue: కేంద్ర బడ్జెట్‌లో భారీగా పన్ను మినహాయింపు దక్కగా తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి మరో కీలక ప్రకటన చేశారు. పాత పన్ను విధానం రద్దు అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో దానిపై ఒక స్పష్టత ఇచ్చారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 4, 2025, 07:00 PM IST
Old Tax Regime: 'పన్ను చెల్లింపుదారులకు బిగ్‌ అలర్ట్‌! పాత పన్ను విధానం రద్దు లేదు'

Old Tax System: పన్ను చెల్లింపుదారులకు మరో కీలక ప్రకటన అందింది. పన్ను విధానంలో పాతది రద్దు చేసి.. కొత్త పన్ను విధానం తీసుకువస్తారని వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. పన్ను చెల్లింపుదారుల్లో నెలకొన్న ఆందోళనకు ముగింపు పలికేలా ప్రకటన విడుదల చేసింది. పాత పన్ను విధానం రద్దు అనే ఆలోచన లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ స్పష్టం చేశారు. పన్ను విధానం సరళంగా ఉండాలనే ఉద్దేశంతో కొత్త పన్ను విధానం తీసుకువచ్చినట్లు వెల్లడించారు.

Also Read: Retirement Age: ఉద్యోగులపై పేలిన భారీ బాంబు.. 65 ఏళ్లకు పెరిగిన రిటైర్మెంట్‌ వయస్సు

ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ కేంద్ర బడ్జెట్‌పై కీలక విషయాలు వెల్లడించారు. ఈ చర్చా వేదికలో ఎదురైన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. వాటిలో పాత పన్ను విధానం రద్దు కూడా ప్రస్తావనకు రాగా నిర్మల ఇలా సమాధానం ఇచ్చారు. 'పాత పన్ను విధానం రద్దు చేయాలనే ప్రతిపాదన కానీ.. ఆలోచన కానీ లేదు. పన్ను ఫైలింగ్‌ సరళంగా ఉండాలనే ఉద్దేశంతో కొత్త పన్ను విధానం తీసుకువచ్చాం' అని ప్రకటించారు.

Also Read: Employees Salaries: కేసీఆర్‌ వ్యాఖ్యలతో 'ప్రభుత్వ ఉద్యోగుల్లో కలవరం'.. నిజంగా 'జీతాలు ఇచ్చే పరిస్థితి ఉండదా?'

'1961లో తీసుకువచ్చిన పాత ఆదాయపు పన్ను చట్టం స్థానంలో అనేక మార్పులు చేసి కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని ప్రవేశపెట్టనున్నాం. కొన్ని రోజుల్లో ప్రవేశపెట్టే కొత్త ఆదాయపు పన్ను బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందుతుందని భావిస్తున్నా' అని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

'జీఎస్టీ శ్లాబుల కుదింపు, రేట్ల తగగింపు ఓ కొలిక్కి వచ్చింది. త్వరలోనే జీఎస్టీ మండలి దీనిపై నిర్ణయం తీసుకుంటుంది. ప్రస్తుతం 5, 12, 18, 28 శాతం చొప్పున నాలుగు శ్లాబులు అమలుతున్నాయి. జీఎస్టీ ధరల హేతుబద్ధీకరణ, రేట్ల సరళీకరణకు సంబంధించి కసరత్తు పూర్తయ్యింది' అని కేంద్ర నిర్మల వెల్లడించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పన్ను మినహాయింపులు ఇచ్చారని జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ ఖండించారు. ఈ అంశంపై మరికొన్ని వివరాలపై నిర్మల సీతారామన్‌ స్పష్టత ఇచ్చారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News