Banks Strike: యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్‌తో పాటు మరో 9 బ్యాంక్ యూనియన్లు దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చారు. మార్చ్ 24, 25 తేదీల్లో బ్యాంకులు పనిచేయవు. ఉద్యోగుల డిమాండ్ల సాధనకై బ్యాంకులు బంద్ కానున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
బ్యాంకు ఉద్యోగులు ఎప్పటి నుంచో వారానికి ఐదు రోజుల పని దినాల కోసం డిమాండ్ చేస్తున్నారు. అన్ని విభాగాల్లో సిబ్బందిని నియమించాలని కోరుతున్నారు. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ అంటే బ్యాంకు ఉద్యోగ సంఘాల సమాఖ్య ఈ సమ్మెకు పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా అన్ని ఉద్యోగ సంఘాలతో సంప్రదింపుల అనంతరం మార్చ్ 24, 25 తేదీల్లో రెండ్రోజులు బంద్ చేయడానికి నిర్ణయించారు. ఇటీవల డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రతిపాదించిన పనితీరు ఆధారిత ఇంక్రిమెంట్లను ఉపసంహరించుకోవాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల మైక్రో మేనేజ్‌మెంట్‌పై డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ తీసుకునే నిర్ణయాలు బోర్డ్ స్వతంత్ర ప్రతిపత్తిని బలహీనం చేస్తున్నాయని బ్యాంక్ ఉద్యోగ సంఘాల సమాఖ్య ఆరోపించింది.
ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ వద్ద పెండింగులో ఉన్న సమస్యలు, గ్రాట్యుటీ చట్టం సవరణ ద్వారా 25 లక్షలకు పెంచాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. ఈ సమస్యలు కూడా పరిష్కరించాలని బ్యాంక్ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్ల సమాఖ్య, నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయిస్, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్ల అసోసియేషన్, బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇతర సంఘాలు ఉన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి