Patanjali Coronil Ban: రాందేవ్ బాబాకు మరో షాక్, కరోనిల్ మందుపై నిషేధం

Patanjali Coronil Ban: యోగా గురువు, పతంజలి సంస్థ వ్యవస్థాపకుడు రాందేవ్ బాబాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. కరోనా వైరస్ కట్టడి చేస్తుందంటూ ప్రవేశపెట్టిన కరోనిల్ మందును మరో దేశం నిషేధించింది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 9, 2021, 08:46 PM IST
 Patanjali Coronil Ban: రాందేవ్ బాబాకు మరో షాక్, కరోనిల్ మందుపై నిషేధం

Patanjali Coronil Ban: యోగా గురువు, పతంజలి సంస్థ వ్యవస్థాపకుడు రాందేవ్ బాబాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. కరోనా వైరస్ కట్టడి చేస్తుందంటూ ప్రవేశపెట్టిన కరోనిల్ మందును మరో దేశం నిషేధించింది.

యోగా గురువు రాందేవ్ బాబా(Ramdev Baba)కు ఇటీవల ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అల్లోపతి వైద్య విధానంపై తీవ్ర విమర్శలు చేసి ఇండియాలో ప్రతిఘటన ఎదుర్కొన్న రాందేవ్ బాబాపై కేసులు కూడా నమోదయ్యాయి. ఇప్పుడు ఆయన సంస్థ ఉత్పత్తి చేస్తున్న కరోనిల్ మందుకు విఘాతం కలుగుతోంది. కరోనా వైరస్ సోకకుండా అద్భుతంగా పనిచేస్తుందంటూ రాందేవ్ బాబా గత ఏడాది కరోనిల్ మందును ప్రవేశపెట్టారు. ఈ మందును గతంలో భూటాన్ నిషేధించింది. ఇప్పుడు తాజాగా నేపాల్ కూడా మందు(Nepal Banned Coronil medicine)వాడకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది. కరోనిల్ మందు పంపిణీను నిలిపివేసింది. రాందేవ్ బాబా ఆ దేశానికి బహుమతిగా అందించిన 15 వందల కరోనిల్ కిట్లను వాడకూడదని నిర్ణయించింది. కరోనా వైరస్‌ను (Corona virus) ఎదుర్కోవడంలో కరోనిల్ విఫలం చెందిందని నేపాల్ ప్రభుత్వం గుర్తించింది.

కరోనిల్ మందును(Coronil Medicine) నిషేధిస్తూ నేపాల్ ఆయుర్వేద మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. కరోనిల్ ట్యాబ్లెట్లు, నూనె కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో విఫలం చెందినట్టు నేపాల్ ఆయుర్వేద మంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనిల్‌కు ప్రత్యామ్నాయ మందుల కోసం నేపాల్ ప్రభుత్వం ఆర్డర్లు చేసింది. 2020 జూన్ 23వ తేదీన పతంజలి (Patanjali) సంస్థ విడుదల చేసిన ఈ మందు కరోనా వైరస్ కట్టడికి పనిచేయదని పలు సర్వేలు వెల్లడించాయి.

Also read: Corona Third Wave: చిన్నారులపై కరోనా థర్డ్‌వేవ్..ఆధారాల్లేవంటున్న నీతి ఆయోగ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News