Monsoon Health Tips: మనం తీసుకునే ఆహారం విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉండాలి. దీంతోనే మన శరీరానికి ఆరోగ్యం. అయితే, ముఖ్యంగా ఈ వర్షాకాలం సీజన్‌లో ఫుడ్ పాయిజన్ సమస్య అధికమవుతుంది. కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా తీసుకునే ఆహారం ఆరోగ్యకరంగా ఉండాలి. అప్పుడే కడుపు సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. ఆహారం కలుషితమవుతే డయేరియా, కడుపులో అజీర్తి సమస్య వస్తుంది. ఈ సీజన్‌లో ఎటువంటి రోగాల బారిన పడకుండా ఉండాలంటే ముఖ్యంగా 4 అలవాట్లు చేసుకోవాలి. అవి ఏంటో తెలుసుకుందాం.
శుభ్రం..
ఏ సీజన్‌లో అయినా ఆహారం వండుకునేటప్పుడు పరిశుభ్రంగా కూరలను కడగాలి. అలాగే బియ్యం, పప్పులు శుభ్రంగా కడగాలి. అప్పుడే బ్యాక్టిరియా తొలగిపోతుంఇ. కూరగాయలు ఈ సీజన్‌లో పాడవుతాయి. ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం కూడా పాడవుతుంది. అందుకే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.
పాల ఉత్పత్తులు..
ముఖ్యంగా ఏ పాల ఉత్పత్తులు ఉపయోగించినా వాటి ఎక్స్‌పైరీ డేట్ సరి చూసుకోవాలి. రిఫ్రిజిరేటర్ లో నిల్వ చేసిన ఆహారాలు పాడవ్వనివి వాడాలి. పాశ్చరైజ్‌డు చేసిన పాలను,పాల ఉత్పత్తులను మాత్రమే ఈ సీజన్‌లో వినియోగించాలి. ఇది బ్యాక్టిరియా బారిన పడకుండా ఉంటుంది.
ఇదీ చదవండి: ఈ 5 ఆహారాలు మీకు హార్ట్ ఎటాక్ రాకుండా చేస్తాయి.. మీ డైట్ లో తప్పక ఉండాల్సినవి..
స్టోర్..
మనం వండుకున్న ఆహారం మిగిలితే ఫ్రిజ్‌లో నిల్వ చేసుకుంటాం. అయితే, కొంతమంది వండుకున్న ఆహారం అక్కడే నిల్వ చేస్తారు. కానీ, ఇలా కాకుండా వండిన వెంటనే ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవాలి. అయితే, ఆహారం ఎప్పటికప్పుడు ఉడికించుకొని తినాలి.
పరిశుభ్రం..
ముఖ్యంగా మీ చేతులను పరిశభ్రంగా ఉంచుకోవాలి. వంట చేసినప్పుడు కూడా మీ చేతులను పరిశుభ్రం చేసుకున్న తర్వాతే వండుకోవాలి. ముఖ్యంగా బయట విక్రయించే ఆహారాలను దూరంగా ఉండాలి.ఎందుకంటే బ్యాక్టిరియా విపరీతంగా పేరుకుపోతుంది కాబట్టి పరిశుభ్రంతకు ప్రథమ స్థానం ఇవ్వండి.
ఇదీ చదవండి: ఈ టీ జాయింట్ పెయింట్స్‌ను తగ్గించే ఎఫెక్టీవ్ రెమిడీ.. మ్యాజికల్ బెనిఫిట్స్ కలుగుతాయి..
వండే విధానం..
ఆహారాన్ని కూడా బాగా ఉడికించుకుని తినాలి. ఎందుకంటే ఈ సీజన్‌లో వాటిపై బ్యాక్టిరియా బాగా పేరుకుపోతుంది. ఆహారాన్ని వేడిగా ఉన్నప్పుడు మాత్రమే తినాలి. చల్లటి ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. మలబద్ధకం వంటి సమస్యలు కూడా వస్తాయి. కడుపులో బ్యాక్టిరియా పెరిగి కడుపు సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి