Stampede at Waltair Veerayya Success Event: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ఇటీవల సంక్రాంతి సందర్భంగా విడుదలయి సూపర్ హిట్గా నిలిచింది. రవితేజ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా జనవరి 13వ తేదీ విడుదలవగా తాజాగా ఈ సినిమా యూనిట్ హన్మకొండలోని యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో నిర్వహించింది. శనివారం రాత్రి విజయోత్సవ వేడుక నిర్వహణ సందర్భంగా తొక్కిసలాట జరిగినట్లుగా తెలుస్తోంది.
ఈ వేడుకలకు పెద్ద ఎత్తున అభిమానులు హాజరైన నేపథ్యంలో వారందరినీ ఒక క్రమ పద్ధతిలో లోపలికి పంపించేందుకు యూనివర్సిటీ గేట్లను మూసివేశారు నిర్వాహకులు. అయితే భద్రతా సిబ్బంది అభిమానులను లోపలికి వదిలేందుకు గేటు వదలడంతో ఒక్కసారిగా అభిమానులు అందరూ లోపలికి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే కొందరు అభిమానులకు తీవ్ర గాయాలైనట్లు చెబుతున్నారు.
అయితే ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలైతే బయటకు వెల్లడి కాలేదు. ఎవరైనా అభిమానులకు తీవ్ర గాయాలయ్యాయా? అనే విషయం మీద మాత్రం అధికారిక సమాచారం అందాల్సి ఉంది. అయితే మెగాస్టార్ చిరంజీవి హీరోగా రవితేజ ప్రధాన పాత్రలో నటించిన వాల్తేరు వీరయ్య సినిమాని మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్ బాబీ దర్శకత్వం వహించారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మించిన ఈ సినిమా విడుదలై 15 రోజులు అవుతుంది అయినా ఇంకా వసూళ్ల వర్షం కురిపిస్తూనే ఉంది.
ఒకపక్క పఠాన్ లాంటి భారీ బడ్జెట్ సినిమా రంగంలోకి దిగిన తర్వాత కూడా ప్రేక్షకులు వాల్తేరు వీరయ్య లాంటి సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉండడంతో నిర్మాతలకు కలెక్షన్ల వర్షం కురుస్తున్నట్లు అయింది. అలాగే మిగతా సినిమాలతో పోలిస్తే సంక్రాంతి సందర్భంగా వాల్తేరు వీరయ్య భారీ కలెక్షన్లు రాబట్టడమే కాదు ప్రేక్షకులందరినీ కూడా అలరించింది. ఈ నేపథ్యంలోనే సంక్రాంతి విన్నర్ గా నిలవడమే కాదు మరిన్ని కలెక్షన్స్ సాధిస్తూ ముందుకు వస్తుంది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి శాసన శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది.
Also Read: Nandamuri Taraka Ratna Health: అత్యంత విషమంగా తారక రత్న ఆరోగ్య పరిస్థితి.. బులెటిన్లో ఏముందంటే?
Also Read: Ar Rahman on keeravani: అన్నీ వదిలేద్దాం అనుకున్నాకే అంతా మొదలైంది.. రెహమాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook