Raw Amla Juice can Reduce Weight & Controls BP: ఉసిరికాయలో శరీరానికి కావాల్సిన చాలా రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. ఇందులో ఉండే గుణాలు అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఇందులో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి సులభంగా రోగనిరోధక శక్తి పెంచి దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా శరీరాన్ని రక్షిస్తుంది. అంతేకాకుండా ప్రతి రోజూ ఉసిరి తినడం వల్ల ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉసిరికాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
ఉసిరిలో విటమిన్ సి, విటమిన్ బి పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి సులభంగా తీవ్ర వ్యాధుల నుంచి ఉపశమనం లభించడమేకాకుండా రోగనిరోగ శక్తినికి కూడా పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఉసిరి ఎలా తీసుకుంటే మంచి ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం.
చర్మానికి మేలు చేస్తుంది:
ఉసిరిలో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి ఇందులో ఉండే గుణాలు రక్తాన్ని శుద్ధి చేయడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా మొటిమల సమస్యలను తగ్గించడానికి కూడా కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ప్రతి రోజూ ఆహారంలో తప్పకుండా ఉసిరి తీసుకోవాల్సి ఉంటుంది.
Also Read: Heart Disease: గుండెపోటు సమస్యతో బాధపడుతున్నారా?, ఈ 2 ఆహారాలు అసలు తినొద్దు!
శరీర బరువును నియంత్రిస్తుంది:
ఉసిరి రసం బరువు తగ్గడానికి ప్రభావవంతంగా దోహదపడుతుంది. కాబట్టి దీనితో తయారు చేసిన రసాన్ని తాగడం వల్ల సులభంగా శరీర బరువును నియంత్రించవచ్చు. అంతేకాకుండా సులభంగా కొలెస్ట్రాల్‌ను నియంత్రించాలనుకునేవారు ప్రతి రోజూ ఉసిరి ఆహారాల్లో తీసుకోవాల్సి ఉంటుంది.
చెడు కొలెస్ట్రాల్‌కు చెక్:
ఉసిరికాయను రోజూ తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు రక్తంలో చక్కెర పరిమాణాలను నియంత్రించడానికి కూడా కీలక సహాయపడుతుంది. కాబట్టి తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ప్రతి రోజూ ఉసిరి రసం తాగాల్సి ఉంటుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, నిపుణుల సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Vande Bharat Express: వందేభారత్ రైళ్లలో కీలక మార్పు, త్వరలో స్లీపర్ కోచ్‌లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook