Junior ntr special appealed to fans: జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల హీరోగా చేసిన దేవర మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఈ మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్ మరోసారిఈ మూవీతో పాన్ ఇంటియా బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతంచేసుకున్నారు. గతంలో ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా హీరోగా ఎన్టీఆర్ మారిన విషయం తెలిసిందే. దీంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆయన్ను కలుసుకునేందకు ఆసక్తి కనబరుస్తున్నారు.
ఇప్పటికే దూర ప్రాంతాల నుంచి ఆయన అభిమానులు పాదయాత్రలు చేసి మరీ ఆయన నివాసంకు చేరుకుంటున్నారు. మరికొందరు సోషల్ మీడియా మాధ్యమాలతో ద్వారా ఎన్టీఆర్ ను ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నారు. ఈ క్రమంలో దీనిపై తాజాగా.. మ్యాన్ ఆఫ్ ది మాసెస్ ఎన్టీఆర్ కీలక ప్రకటన చేశారు. తొందరలోనే సమావేశం ఏర్పాటు చేసి అభిమానులతో కలుస్తానని అన్నారు.
తనపై అభిమానులు చూపిస్తున్న అపారమైన ప్రేమ, గౌరవానికి ఎల్లప్పుడు కూడా రుణ పడి ఉంటానని అన్నారు. దయచేసి తనను కలుసుకోవాలని పాదయాత్రలు చేయోద్దని.. తొందరలోనే పోలీసు డిపార్ట్ మెంట్, సంబంధిత అధికారులతొ మాట్లాడి సమావేశంను అధికారికంగా ప్రకటిస్తామని వెల్లడించారు. ముఖ్యంగా శాంతి భద్రతల సమస్యలు, అభిమానులకు ఇబ్బందులు కల్గకుండా చర్యలు తీసుకుని ఈ సమావేశం ఏర్పాటు చేద్దామని జూనియర్ ఎన్టీ ఆర్ అన్నారు.
అప్పటి వరకు దయచేసి కాస్త ఓపిగ్గా ఉండాలని జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా అభిమానులకు రిక్వెస్ట్ చేశారు. తనకు అభిమానుల ఆనందంతోపాటు.. వారి సెఫ్టీ కూడా ముఖ్యమని అన్నారు. ఈ మేరకు జూనియర్ ఎన్టీఆర్ టీమ్ ఒక ప్రకటన విడుదల చేసింది. దీంతో ప్రస్తుతం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter