Chiranjeevi: అవును తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్ది, మెగా స్టార్ చిరంజీవి హైదరాబాద్ లో ‘ఎక్స్ పీరియం’ పార్క్ ప్రారంభోత్సవేళ కలిసారు. చిలుకూరులోని ప్రొద్దుటూరు వెస్ట్రన్ సెంటర్‌లో రామడుగు రాందేవ్ రావు ఎక్స్‌పీరియం పార్క్‌ను మెగాస్టార్ చిరంజీవి చేతులు మీదుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ మంగళవారం జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ టూరిజం మినిస్టర్ జూపల్లి కృష్ణారావు, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఛీఫ్ గెస్ట్ గా విచ్చేశారు.
ఈ కార్యక్రమంలోమెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ‘రాందేవ్‌తో నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది.ఈ ఎక్స్‌పీరియం పార్కుని అందరి కంటే ముందుగా నేను చూశాను. 2000 యేడాదిలో దీని గురించి రాందేవ్ నాతో ప్రస్తావించారు. 2002 నుంచి నేను కూడా రాందేవ్ వద్ద నుంచి మొక్కల్ని తెప్పించుకుంటూనే ఉన్నాను. మా ఇంట్లో ఉండే అనేక రకాల మొక్కలు, చెట్లు రాందేవ్ వద్ద నుంచి వచ్చినవే. రాందేవ్ ఓ వ్యాపారవేత్తగా ఎప్పుడూ ఆలోచించరు. ప్రకృతి, పర్యావరణం గురించి ఆలోచించే వ్యక్తి. ఈ 150 ఎకరాలను కమర్షియల్ గా వాడుకోవచ్చు. కానీ ఆయన ఈ 25 ఏళ్లుగా రకరకాల మొక్కల్ని, వివిద దేశాల నుంచి కొత్త జాతి మొక్కల్ని ఇక్కడకు తీసుకొచ్చి ఈ పార్కుని అభివృద్ది చేసిన విషయాన్ని ప్రస్తావించారు.
A new era of eco-friendly innovation has begun in Hyderabad! Experium Eco-Friendly Park was officially inaugurated by Chief Minister Revanth Reddy, Megastar Chiranjeevi, Tourism Minister Jupally Krishna Rao, and Founder Ramdev Rao . #experium #experiumpark #RevanthReddy pic.twitter.com/dUVJonccTO
— Experium (@Experiumpark) January 28, 2025
ఈ ఎక్స్‌పీరియం పార్కుని చూసి నేను, గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూసి షాక్ అయ్యామని చెప్పుకొచ్చారు. ఇంత అద్భుతంగా ఉన్న ఈ పార్కుని చూసి షూటింగ్‌కు ఇస్తారా? అని రాం దేవ్‌ను అడిగాను. ఫస్ట్ షూటింగ్ చేసేది నా సినిమానే అయితే ఇస్తామని నవ్వుతూ అన్నారు. కానీ ఈ ఎండలో నేను ఇక్కడ హీరోయిన్‌తో స్టెప్పులు వేయడం అంటే కాస్త కష్టమే. వర్షా కాలం తరువాత ఇక్కడ మరింత గ్రీనరి వస్తుందని ఆ టైంలో షూటింగ్ చేస్తే అద్భుతంగా ఉంటుందన్నారు. వెడ్డింగ్, రిసెప్షన్, ఇతర కార్యక్రమాలకు ఈ చోటు అనువుగా ఉంటుందన్నారు.
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
దేశవిదేశాల్లో ఉండే ఎన్నో అరుదైన జాతి మొక్కల్ని ఒక చోటకు చేర్చి ఇంత అద్భుతమైన పార్కుని రాం దేవ్ నిర్మించడం ఆయన అభిరుచికి నిదర్శనం. ఇలాంటి మహోత్తర కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి రావడం అభినందనీయమన్నారు. ఆయన ఎంత బిజీగా ఉన్నా కూడా ఇలాంటి ప్రకృతి, పర్యావరణ సంరక్షణ కార్యక్రమాలకు రావడం హ్యాపీగా ఉందన్నారు.
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.