Tollywood Controversies :
బేబీ సినిమా పోస్టర్ నుండి నిన్న మొన్న జరిగిన సలార్ వర్సెస్ డంకీ గొడవ దాకా మన టాలీవుడ్ లో బాగా వైరల్ అయిన కొన్ని వివాదాలు ఇవే..
యానిమల్ : సినిమా లో ఆడవాళ్ళని చూపించిన విధానం పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఇక సినిమాలో ఉన్న బోల్డ్ సన్నివేశాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా విడుదల తర్వాత సెన్సార్ బోర్డ్ సీఈఓ ని కూడా తీసేశారు అని కూడా పుకార్లు వచ్చాయి.
బేబీ : ఒక వ్యక్తి మిడిల్ ఫింగర్ పై హీరోయిన్ నిలబడి ఉన్నట్లుగా ఒక పోస్టర్‌ను డిజైన్ చేసి విడుదల చేసింది చిత్ర బృందం. దీంతో ఈ పోస్టర్ విడుదలైన కొద్ది నిమిషాల్లోనే నెటిజన్లు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసి ట్రోల్ చేశారు.
ఆది పురుష్ : సినిమాలో హనుమంతుడి పాత్ర తో మాస్ డైలాగులు చెప్పించడం నుండి రావణాసురుడు ఈ పాత్ర వరకు ఈ సినిమా కూడా ఎన్నో వివాదాలకు గురైంది.
అక్కినేని తొక్కినేని : ఒక ఈవెంట్ లో అక్కినేని నాగేశ్వరరావు గురించి మాట్లాడుతూ అక్కినేని తొక్కినేని అంటూ బాలకృష్ణ చేసిన కామెంట్లు బాగా వైరల్ అయ్యాయి. ఈ విషయమై నాగచైతన్య కూడా సోషల్ మీడియా ద్వారా నిరాశ వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
వెంకటేష్ మహా కేజీఎఫ్ : కే జి ఎఫ్ సినిమాలో రాకీ బాయ్ పాత్ర గురించి మాట్లాడుతూ నీచ్ కమీన్ కుత్తే అని వెంకటేష్ మహా చేసిన కామెంట్లపై కన్నడ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా నిప్పులు కురిపించారు.
త్రిష - మన్సూర్ అలీఖాన్ : లియో సినిమాలో త్రిష ను రేప్ చేసే సన్నివేశం లేకపోవడంతో బాధపడ్డాను అని నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టించాయి. మహిళా సంఘాలతో పాటు కొందరు సెలబ్రిటీలు కూడా మన్సూర్ పై మండిపడ్డారు.
సలార్ వర్సెస్ డంకీ : నార్త్ ఇండియాలో షారుఖ్ ఖాన్ డంకీ సినిమాకి డిస్ట్రిబ్యూటర్లు మల్టీప్లెక్స్ లతో సహా ఎక్కువ థియేటర్లు ఇచ్చి ప్రభాస్ సినిమాకి మాత్రం కేవలం సింగిల్ స్క్రీన్లు మాత్రమే ఇచ్చారు అని పివిఆర్ ఇనాక్స్ మరియు మిరాజ్ థియేటర్ చైన్ లపై ప్రభాస్ ఫ్యాన్స్ ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు.
Also read: Corona New Variant Jn.1: దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు, 17 రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదు
Also read: India Covid Cases Today: ఒక్క రోజులో భారీగా పెరిగిన కరోనా కేసులు.. మొత్తం ఎన్ని కేసులంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook