OTT వేదికగా Actor Nithiin లేటెస్ట్ మూవీ చెక్ రిలీజ్, ఫ్యామిలితో కలిసి వీక్షించండి

Actor Nithiins Check Movie On OTT: చంద్రశేఖర్ ఏలేటి తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ చెక్. యూత్ స్టార్ నితిన్ హీరోగా క్రైమ్ డ్రామా జానర్‌లో స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తీసిన మూవీ ఫిబ్రవరి వారాంతంలో థియేటర్లలో విడుదలైంది. మంచి టాక్ వచ్చినా, సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది.

Written by - Shankar Dukanam | Last Updated : May 12, 2021, 09:53 AM IST
OTT వేదికగా Actor Nithiin లేటెస్ట్ మూవీ చెక్ రిలీజ్, ఫ్యామిలితో కలిసి వీక్షించండి

Actor Nithiins Check Movie: విభిన్న కథా చిత్రాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న చంద్రశేఖర్ ఏలేటి తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ చెక్. యూత్ స్టార్ నితిన్ హీరోగా క్రైమ్ డ్రామా జానర్‌లో స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తీసిన మూవీ ఫిబ్రవరి వారాంతంలో థియేటర్లలో విడుదలైంది. మంచి టాక్ వచ్చినా, సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. ప్రేమకథా చిత్రాలకు కాస్త భిన్నంగా ట్రై చేశాడని టాక్ వినిపించింది.

వి. ఆనంద ప్రసాద్ చెక్ మూవీని నిర్మించగా, కళ్యాణి మాలిక్ స్వరాలు సమకూర్చారు. నితిన్(Actor Nithin), రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోహీరోయిన్లుగా కనిపించారు. టాలీవుడ్ మూవీ చెక్‌పై ప్రముఖ పీఆర్వో బీఏ రాజు అప్‌డేట్ అందించారు. ఈ సినిమా మే 14 నుంచి సన్‌నెక్ట్స్(Check Movie On Sunnxt) యాప్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. అసలే తెలంగాణలో లాక్‌డౌన్, ఏపీలోనూ కర్ఫ్యూ ఆంక్షలు కఠినతరం చేస్తున్న నేపథ్యంలో ఇంటి వద్దనే కూర్చుని కుటుంబంతో కలిసి చెక్ మూవీని వీక్షించాలని సినిమా యూనిట్ కోరుతోంది.

Also Read: Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌కు కరోనా పాజిటివ్

అనుకోని పరిస్థితుల్లో అరెస్ట్ అయిన యువకుడు ఉగ్రవాదిగా ముద్రపడితే ఎలా ఉంటుంది, ఆపై జైలులో విచారణ ఎదుర్కొంటున్న ఖైదీగా ఉంటూనే చెస్ గేమ్ నేర్చుకుని ఏకంగా జాతీయ స్థాయిలో మాస్టర్ కావడం ఇంట్రస్టింగ్ పాయింట్. అయితే ఎవరి కారణంగా నితిన్ జైలుకు వెళ్లాడు, అతడిని కాపాడేందుకు లాయర్లు ఎలాంటి ప్రయత్నాలు చేశారో తెలియాలంటే సన్‌నెక్ట్స్ యాప్‌లో చెక్ మూవీని వీక్షించండి. లాక్‌డౌన్, కరోనా వ్యాప్తి సమయంలో ప్రేక్షకులకు ఓటీటీ వేదికలే సినిమాలకు ప్రత్యామ్నాయంగా మారుతున్నాయని తెలిసిందే.

Also Read: Check movie collections: చెక్ మూవీ Box office result చెక్ చేశారా ? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News