Maruti Dzire 2024: కొత్త మారుతి డిజైర్ వచ్చేస్తోంది లాంచ్ ఎప్పుడు, ఎలా ఉంటుందంటే

Maruti Dzire 2024: దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన కార్లలో ప్రముఖమైంది మారుతి సుజుకి. అందుకే మారుతి సుజుకి కార్లు ఎప్పుడూ టాప్ 10 విక్రయాల్లో ఉంటాయి. మారుతి సుజుకి అంటే ఓ నమ్మకం. మారుతి సుజుకి డిజైర్ అంటే ఇక ఎవర్‌గ్రీన్ మోడల్ అనే చెప్పాలి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 5, 2024, 06:58 PM IST
Maruti Dzire 2024: కొత్త మారుతి డిజైర్ వచ్చేస్తోంది లాంచ్ ఎప్పుడు, ఎలా ఉంటుందంటే

Maruti Dzire 2024: మారుతి సుజుకి కార్లలో డిజైర్‌కు చాలా క్రేజ్ ఎక్కువ. మార్కెట్‌లో అద్భుతంగా క్లిక్ అయిన సెడాన్ కారు ఇది. అందుకే మారుతి సుజుకి ఇప్పుడు కొత్త డిజైర్ తీసుకొస్తోంది. నవంబర్ 11న లాంచ్ కానున్న మారుతి సుజుకి కొత్త డిజైర్ చూస్తే ఎవరికైనా మతిపోవల్సిందే. అందుకే కస్టమర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. 

మారుతి సుజుకి ఇండియాలో నవంబర్ 11వ తేదీన డిజైర్ 2024 లాంచ్ చేయనుంది. ఇది కొత్త జనరేషన్ డిజైర్ కారు. అందుకే కస్టమర్లకు ఈ కారుపై చాలా ఆసక్తి నెలకొంది. లాంచ్ కంటే ముందే ఈ కారు ఫోటో లీక్ కావడంతో అందరి మతి పోగొడుతోంది. అద్భుతమైన ప్రీమియం లుక్‌తో ఆకర్షిస్తోంది. ఈ కారులో రీ డిఫైన్ హెడ్‌ల్యాంప్, టెయిల్ ల్యాంప్ కాంబినేషన్ చూసి కస్టమర్ల ఎగ్జైట్‌మెంట్ పీక్స్‌కు చేరుతోంది. ఇప్పటి వరకు అందిన వివరాల ప్రకారం డిజైర్ ఇన్నర్ ఇంటీరియర్ మార్పులతో మార్కెట్‌లో లాంచ్ కానుంది. ఇందులో డ్యూయల్ టోన్ కేబిన్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇది డ్యాష్ బోర్డ్‌పై ఫాక్స్ వుడ్ ట్రిమ్‌తో ఉంటుంది. అంతేకాకుండా మల్టీ ఫంక్షనల్ 3 స్పోక్ స్టీరింగ్ వీల్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. కంట్రోల్ సెక్షన్‌లో కొద్దిగా మార్పులుంటాయి. కొత్త డిజైర్ ప్రీమియం లుక్‌తో ఉంటుంది. 

ఇక ఇందులో ఫ్లోటింగ్ టచ్‌ స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇందులో ఆండ్రాయిడ్, ఆపిల్, ఆటో కార్ ప్లే సహా అన్ని వైర్‌లెస్ కనెక్టివిటీ టెక్నాలజీ ఉంటుంది. టాప్ ఎండ్ ట్రిమ్ మోడల్‌లో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జర్, 360 డిగ్రీ కెమేరా వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. ఇక ఇంజన్ విషయానికొస్తే ఇందులో 1.2 లీటర్ జెడ్ సిరీస్ కొత్త 3 సిలెండర్ ఇంజన్‌తో వస్తోంది. 80 బీహెచ్‌పి పవర్, 112 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. 

Also read: Family Pension New Rules: ఫ్యామిలీ పెన్షన్ కొత్త రూల్స్ ఇవే, కుమార్తె పెన్షన్‌కు అర్హురాలు కాదా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News