CNG Price: ఆటోవాలాకు షాక్​.. పెట్రోల్, డీజిల్​తో పోటీగా పెరుగుతున్న సీఎన్​జీ ధరలు

CNG Price: దేశంలో ఇంధనల ధరలు రోజు రోజుకు రికార్డు స్థాయికి పెరుగుతున్నాయి. పెట్రోల్​, డీజిల్ ధరలతో పాటు.. ఆటోల్లో ఎక్కువగా వినియోగించే సీఎన్​జీ ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. వివిధ నగరాల్లో సీఎన్​జీ ధరలు ఇలా ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 6, 2022, 12:38 PM IST
  • దేశంలో భారీగా పెరిగిన సీఎన్​జీ ధరలు
  • ఐదు రోజుల్లో రూ.6.6 వరకు పెరిగిన రేటు
  • హైదరాబాద్​లో రూ.75 దాటిన కిలో సీఎన్​జీ ధర
CNG Price: ఆటోవాలాకు షాక్​.. పెట్రోల్, డీజిల్​తో పోటీగా పెరుగుతున్న సీఎన్​జీ ధరలు

CNG Price: పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకు భారీగా పెరుగుతూ సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. అయితే పెట్రోల్​, డీజిల్​కు ప్రత్యామ్నాయంగా వాడుతున్న (ఆటోల్లో ఎక్కువగా) సీఎన్​జీ (కంప్రెస్డ్​ నాచురల్ గ్యాస్​) ధరలు కూడా క్రమంగా పెరుగుతుండటం ఆందోళనకరమంటున్నారు విశ్లేషకులు.

తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో సీఎన్​జీ ధర కిలో రూ.2.5 వరకు పెరిగింది. దీనితో.. కిలో సీఎన్​జీ ధర రూ.66.61కు చేరింది. గడిచిన ఐదు రోజుల్లో సీఎన్​జీ ధర కిలో రూ.6.6 వరకు పెరగటం గమనార్హం.

వివిధ నగరాల్లో సీఎన్​జీ రేట్లు ఇలా..

  • హైదరాబాద్​లో కిలో సీఎన్​జీ ధర రూ.75.75 వద్ద ఉంది.
  • గ్రేటర్​ నోయిడా, గాజియాబాద్​లో సీఎన్​జీ రేటు కిలో రూ.69.18 వద్దకు చేరింది.
  • ముజాఫర్​నగర్, మీరఠ్​, సిమ్లాలో కిలో సీఎన్​జీ ధర రూ.74.94 వద్దకు పెరిగింది.
  • గురుగ్రామ్​లో సీఎన్​జీ ధర కేజీ రూ.74.74 వద్ద ఉంది.
  • కాన్పూర్, ఫతేపూర్​ వంటి నగరాల్లో కిలో సీఎన్​జీ ధఱ రూ.78.40 వద్ద ఉండటం గమనార్హం.
  • అజ్మేర్​, పలిలో సీఎన్​జీ ధర రూ.76.89 (కిలోకు) వద్ద విక్రయమవుతోంది.

మరింత ప్రియమైన పెట్రోల్, డీజిల్ ధరలు..

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు బుధవారం 80 పైసల చొప్పున పెరిగాయి. దీనితో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్  ధర రూ.105.41 వద్దకు పెరగ్గా.. డీజిల్ ధర లీటర్ రూ.96.67కు చేరింది.

దేశ ఆర్థిక రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రికార్డు స్థాయి అయిన రూ.150.51 వద్ద కొనసాగుతోంది (84 పైసలు పెరిగింది.). లీటర్ డీజిల్ ధర రూ.104.77 (85 పైసలు పెరిగి) వద్ద కొనసాగుతోంది. 

Also read: Petrol Price Today: ఆగని పెట్రో మోత.. మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!

Also read: iPhone Thefts: ఐఫోన్‌ దొంగతనాలకు చెక్‌ పెట్టేందుకు యాపిల్ సంస్థ కీలక నిర్ణయం...!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News