Tirumala Darshanam: రథ సప్తమి పర్వదినం సందర్బంగా టీటీడీ బోర్డ్ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సకల ఏర్పాట్లు చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మధ్య జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. గ్యాలరీల్లోకి వచ్చి వెళ్ళే దారుల్లోకి భక్తుల ప్రవేశాల సందర్భంగా తగిన జాగ్రత్తలు తీసుకోనున్నారు. అలాగే భద్రత, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోనున్నారు.
రథసప్తమికి టీటీడీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. మలయప్పస్వామికి ఆరోజు ఏడు వాహనాల సేవ జరుగనుంది. ఈ వాహనసేవలు తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు జరుగుతాయి. ఈ వేడుకకు సుమారు రెండు లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. పోలీసులు, టీటీడీతో సిబ్బంది, NDRF భద్రతా బలగాలను వినియోగించే అవకాశం ఉందని తెలుస్తోంది. వచ్చే నెల 4న రథసప్తమి మహోత్సవం రోజున భక్తులు తిరుమలలోని మాడవీధుల్లోని గ్యాలరీల్లోకి ప్రవేశించే మార్గాలపై ఫోకస్ పెట్టారు. తొక్కిసలాటలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
రథసప్తమి సందర్భంగా పలు సేవలు, ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేశారు . అష్టదళ పాద పద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు రద్దు చేసింది. ఎన్.ఆర్.ఐలు, చంటి బిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాలు రద్దు చేసారు. తిరుపతిలో ఫిబ్రవరి 3 – 5 వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు జారీ చేయరు. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా విఐపి బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. బ్రేక్ దర్శనాలకు సంబంధించి ఫిబ్రవరి 3న ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించరు. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు ఉన్న భక్తులు వేచి ఉండకుండా ఉండేందుకు నిర్ణీత సమయంలో మాత్రమే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద రిపోర్ట్ చేయాలని టీటీడీ భక్తులకు సూచించింది.
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.