TTD Member Video: పవిత్రమైన తిరుమల పుణ్యక్షేత్రం ప్రాంగణంలో తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యుడు ఓ ఉద్యోగిని తీవ్రంగా అవమానించాడు. థర్డ్ క్లాస్ నా కొడుకువి అంటూ బూతులు తిట్టడమే బయటకి పొమ్మంటూ గెంటివేశాడు. ఈ వీడియో వైరల్ అవుతోంది.
తిరుమలలో మరో వివాదం రాజుకుంది. థర్డ్ క్లాస్ నా కొడుకువి అంటూ ఆలయం సన్నిధిలో టీటీడీ బోర్డు సభ్యుడి బూతు పురాణం, దాష్టీకం బయటపడింది. వీఐపీ బ్రేక్ దర్శనంలో నిన్న శ్రీవారిని దర్శించుకున్న టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ సన్నిహితులతో కలిసి మహాద్వారం వద్దకు చేరుకున్నాడు. అయితే అక్కడ ఉన్న టీటీడీ ఉద్యోగి బాలాజీ అడ్డుకుని ఈ గేటు నుంచి ఎవరినీ పంపించడం లేదని చెప్పాడు. అభ్యంతరం ఉంటే ఉన్నతాధికారులకు సంప్రదించాలని వివరించాడు. దాంతో సదరు టీటీడీ బోర్డు సభ్యుడికి ఈగో హర్ట్ అయినట్టుంది. సహనం కోల్పోయి థర్డ్ క్లాస్ నా కొడుకువి..నిన్న ఇక్కడ పెట్టిందెవరు, ఏమనుకుంటున్నావు, ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియదా..ముందు నువ్వు బయటకు పో...అంటూ ఆ చిరుద్యోగిపై దూషణకు దిగాడు. బలవంతంగా ఆ ఉద్యోగిని అక్కడ్నించి పంపించేశాడు. థర్డ్ క్లాస్ నా కొడుకు అంటూ వీరంగం చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
తిరుమల ఆలయ సన్నిధిలో టీటీడీ బోర్డు సభ్యుడు ఇలా ప్రవర్తించడం సమంజసమా, అసలు ఇలాంటి వ్యక్తి టీటీడీ బోర్డులో సభ్యుడిగా ఉండవచ్చా అనే ప్రశ్నల విన్పిస్తున్నాయి. ఓ చిరుద్యోగిని థర్డ్ క్లాస్ అని సంబోధించిన నరేష్ కుమార్..టీటీడీ సభ్యుడు కాకపోతే ఏ క్లాస్‌కు చెందినవాడూ అతనికే తెలియాలి.
Also read: Teacher Transfers: ఏప్రిల్ నుంచి టీచర్ల బదిలీలు, జాబితా సిద్ధం చేస్తున్న అధికారులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి