Posani Krishna Murali Arrest: నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కారణంతో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదవడంతో హైదరాబాద్‌కు వచ్చి రాత్రిపూట నటుడు పోసాని కృష్ణ మురళీని అరెస్ట్ చేయడం వివాదాస్పదంగా మారింది. పండుగ పూట ఇంట్లోకి దూసుకొచ్చి అరెస్ట్ చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే అరెస్ట్ సమయంలో పోసాని భోజనం కూడా చేయలేదని.. అన్నం తినాలని చెప్పినా కూడా వినిపించుకోకుండా అరెస్ట్ చేశారని పోసాని భార్య వాపోతున్నారు. అతడికి అనారోగ్యం ఉందని.. ట్యాబ్లెట్లు వేసుకోవాలని.. అవేంటో కూడా తెలియవని పోలీసులకు పోసాని భార్య చెబుతున్న వీడియో వైరల్‌గా మారింది.
Also Read: Posani Krishna Murali: బిగ్ బ్రేకింగ్.. నటుడు పోసాని కృష్ణ మురళీ అరెస్ట్.. ఏపీకి తరలింపు?
చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్‌పై పోసాని కృష్ణ మురళీ అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి గాను ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీసులు కూడా కేసు నమోదు చేసి అతడిని అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్‌కు వచ్చారు. పోసాని ఇంటికి చేరుకుని నోటీసులు జారీ చేశారు. క్రైమ్ నంబర్ 65/2025 అండర్ సెక్షన్ 196, 353(2), 111 రెడ్ విత్ 3(5) బీఎన్ఎస్ యాక్ట్ 2033 నాన్ బెయిలబుల్ కింద నోటీసు ఇచ్చారు. దీనికి గాను అరెస్ట్ చేస్తున్నట్లు పోసాని సతీమణి.. అతడి అబ్బాయికి నోటీసు ఇచ్చారు.
Also Read: YSRCP Kidnap: వల్లభనేని వంశీ కేసులో వైఎస్సార్‌సీపీ సంచలనం.. వీడియో విడుదల
ఆరోగ్యం బాగోలేదని పోసాని చెప్పినా అరెస్ట్ చేస్తున్నామని తమకు సహకరించాలని ఏపీ పోలీసులు చెప్పారు. పోసాని సతీమణి అతడి ఆరోగ్యం విషయంలో ఆందోళన వ్యక్తం చేయగా.. పోసానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని.. ట్యాబ్లెట్లు అన్నీ తమకు ఇవ్వాలని పోసాని సతీమణికి పోలీసులు కోరారు. పోలీసులు వచ్చిన సమయంలో పోసాని బనీయన్, నిక్కర్‌లో ఉన్నారు. అతడిని దుస్తులు వేసుకునేందుకు సమయం ఇచ్చిన పోలీసులు అనంతరం అదుపులోకి తీసుకుని వెళ్లిపోయారు. అరెస్ట్ సమయంలో పోసాని ఆందోళన వ్యక్తం చేశారు. 'టెన్షన్ పడకు..' అంటూ భర్త పోసాని సతీమణి బుజ్జగిస్తున్న దృశ్యాలు ఆవేదన కలిగిస్తున్నాయి. పోసాని అనారోగ్యంతో బాధపడుతున్నారని.. అతడు నిత్యం మందులు వేసుకుంటున్నారని భార్య మాటలు వింటే తెలుస్తోంది. అయితే అరెస్ట్ సమయంలో పోసాని కుమారుడు వీడియోలు తీస్తుండగా పోలీసులు వారించారు.
పోసాని కృష్ణమురళి గారిని హైదరాబాద్ గచ్చిబౌలిలోని తన నివాసంలో అక్రమ అరెస్ట్ @ncbn, @naralokesh, @PawanKalyan ను ప్రశ్నించాడనే కారణంతో కక్ష సాధిస్తూ తప్పుడు కేసులు
పోసానికి ఆరోగ్యం బాలేదని అతని సతీమణి చెప్తున్నా.. దురుసుగా ప్రవర్తిస్తూ గచ్చిబౌలి లోని ఆయన నివాసం నుంచి తీసుకెళ్లిన… pic.twitter.com/hXFXWRKnHm
— YSR Congress Party (@YSRCParty) February 26, 2025
#Hyderabad---#AndhraPradesh's #Rayachoti Police arrested film actor and @YSRCParty leader Posani Krishna Murali from his residence in My Home Bhuja, #Raidurg on Wednesday.
Posani was reportedly arrested in connection with several cases filed against him for making derogatory… pic.twitter.com/YP0LiLuhyX
— NewsMeter (@NewsMeter_In) February 26, 2025
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook