Pawan Kalyan -Maha Kumbh: ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేనాని పవన్ కళ్యాణ్ మహాకుంభమేళలో పవిత్ర స్నానం చేశారు. త్రివేణి సంగమం వద్ద గంగామాతకు హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. మహాకుంభమేళ ద్వారా దేశంలో తూర్పు,పశ్చిమ,ఉత్తర,దక్షిణ అనే తేడా లేకుండా ప్రజలంతా ఒక్కటయ్యారని అన్నారు. కుంభమేళాకి వచ్చిన ప్రతిఒక్కరు క్షేమంగా ఇంటికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసిన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు పవన్.ఈ కార్యక్రమంలో భార్య అన్నా లెజినోవా, కుమారుడు అకిరానందన్, దర్శకుడు త్రివిక్రమ్ ఆయనతో కలిసి ఫుణ్యస్నానలు ఆచరించారు. ఈ
సందర్భంగా సనాతన ధర్మం గురించి మాట్లడుతూ.. సనాతన ధర్మం భారతీయులందరి ఏకత్వానికి నిదర్శనం అన్నారు.
దేశంలోని సగం జనాభా పుణ్య స్నానాలు ఆచరించడం గొప్ప విషయమన్నారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మహా కుంభమేళా ఏర్పాట్లు పక్కాగా చేసిందని కొనియాడారు. వేల సంవత్సరాలుగా కుంభమేళా జరుగుతున్నట్లు చరిత్ర చెబుతోంది. నేను గతంలో ఒక యోగి ఆత్మకథ అనే పుస్తకం చదువుతున్నప్పుడు దానిలో కుంభమేళా గురించి వివరిస్తూ ఉన్న వాక్యాలు చదివాను. సుమారు మూడు దశాబ్దాలుగా కుంభమేళాను గమనిస్తున్నాను. ప్రతిసారీ రావాలని భావించినా ఎందుకో కుదరలేదు. ఇప్పుడు మహా కుంభమేళాకు రావడం చాలా సంతోషం కలిగించిందన్నారు. .
మంగళవారం సాయంత్రం ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో మహా కుంభ మేళాకు పవన్ కళ్యాణ్, శ్రీమతి అనా కొణిదెల దంపతులు హాజరై పుణ్య స్నానం ఆచరించారు, అనంతరం త్రివేణి సంగమానికి హారతులిచ్చారు. అకీరా నందన్, త్రివిక్రమ్, ఆనంద సాయి పుణ్య స్నానాలు చేశారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ “భారతీయులంతా విభిన్నమైన జాతులు, తెగలు, సంప్రదాయాలను ఆచరిస్తున్నప్పటికీ సనాతన ధర్మం విషయంలో మాత్రం ఏకమవుతారన్నారు. దేశం విషయంలో భిన్నత్వంలో ఏకత్వం ఎలా పని చేస్తుందో.. ధర్మం విషయంలో కూడా భారతీయుల్లో అదే రకమైన ఏకత్వం పని చేస్తుందన్నారు. వేల ఏళ్లుగా సనాతన ధర్మం వర్థిల్లుతోంది. సనాతన ధర్మం ఇలాగే భవిష్యత్తులోనూ పరిఢవిల్లాలన్నారు.
ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు ఏదో ఒకటి మాట్లాడటం సులభం. కేవలం హిందూ సంప్రదాయాలు, సనాతన ధర్మం కార్యక్రమాల నిర్వహణలో ఏదైనా దుర్ఘటన జరిగితే వెంటనే పొలిటీషన్స్ నోర్లు లేస్తాయి. పోలీసులు, అధికారులు సమన్వయంతో పని చేసి, పక్కాగా తగిన సౌకర్యాలు కల్పించినా, ఒక్కోసారి అనుకోని విధంగా ఘటనలు జరగడం బాధాకరమన్నారు. ఇటీవల తిరుపతిలో జరిగిన దుర్ఘటనకు ముందు కూడా పక్కాగా ఏర్పాట్లు చేసినా ఒకేసారి సమూహంలో వచ్చిన కదలిక వల్ల తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇలాంటి దుర్ఘటనలు దేశంలో ఏ ప్రాంతంలో జరిగినా అక్కడ పరిస్థితిని అర్థం చేసుకొని స్పందిస్తే బాగుంటుందన్నారు. సనాతన ధర్మం నమ్మే వారి మనోభావాలను దెబ్బ తీసేలా మాట్లాడడం మంచిది కాదని సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు.
కుంభమేళాలో దాదాపు దేశంలో సగం జనాభా కుంభమేళాకు తరలి రావడం చాలా గొప్ప విషయం. ప్రపంచంలో ఇలాంటి మహా కార్యక్రమం ఇప్పటివరకు జరగలేదు. ఇది సనాతన ధర్మం ఆచరించే ప్రతి ఒక్కరి మహా పండుగగా భావిస్తున్నారు. దేశంలోని నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి పుణ్య స్నానాలు ఆచరించి వెళ్లడం మహా అద్భుత ఘట్టం అన్నారు.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
గత 50 రోజులుగా 50 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరించిన మహా కుంభ మేళా లో జరిగిన కొన్ని సంఘటనలు దురదృష్టకరమన్నారు. సనాతన ధర్మాన్ని పాటించే వారిపైన, సనాతన ధర్మాన్ని నమ్మే వారి పైన ఇలాంటి సమయంలో కొందరు నేతలు ఇష్టానుసారం మాట్లాడటం బాధ్యతారాహిత్యమే అవుతుంది. ఓటు బ్యాంక్ రాజకీయాలకు మహా కుంభమేళాను వాడుకోవడం దారుణమన్నారు. మహా కుంభ మేళా నిర్వహణలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో పని చేస్తూ ముందుకెళ్లారు. ఒక భారీ సమూహం ఒక చోట గుమి కూడినప్పుడు కొన్ని దురదృష్టకర సంఘటనలు జరిగే అవకాశాలున్నాయి. దాన్ని మొత్తంగా సనాతన ధర్మానికి ఆపాదించి, ఆ ధర్మాన్ని నమ్మేవారిపై.. సనాతన ధర్మంలో ఆచరించే సంప్రదాయాల నిర్వహణ గురించి ఇష్టానుసారం వ్యాఖ్యానించడం సబబు కాదన్నారు. ఇలాంటి దుర్ఘటనలు ఇతర మత ధర్మాలను పాటించే కార్యక్రమాల్లో జరిగితే రాజకీయ నాయకులు ఇలాగే స్పందించేవారా ? అన్నారు.
ఇదీ చదవండి: తాగుడుకు బానిసై సినీ కెరీర్ నాశనం.. 44 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ రెండో పెళ్లి..
ఇదీ చదవండి: వై టార్గెట్ చిరంజీవి.. ? మెగా ఫ్యామిలీని కావాలనే టార్గెట్ చేశారా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.