Vijayawada Durga Temple: దుర్గమ్మ సన్నిధిలో మహా అపచారం.. భక్తుడికి ఇచ్చిన లడ్డులో ఏమోచ్చిదంటే..?

kanaka durga temple: విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ సన్నిధికి దర్శనానికి వెళ్లిన ఒక భక్తుడికి షాకింగ్ అనుభవం ఎదురైంది. దీంతో అతను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు. అది ప్రస్తుతం వైరల్ గా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Feb 9, 2025, 06:18 PM IST
  • ఇంద్ర కీలాద్రిలో భక్తుడికి అనుకొని ఘటన..
  • చర్యలు తీసుకుంటామని చెప్పిన మంత్రి ఆనం..
Vijayawada Durga Temple: దుర్గమ్మ సన్నిధిలో మహా అపచారం.. భక్తుడికి ఇచ్చిన లడ్డులో ఏమోచ్చిదంటే..?

Vijayawada kanaka durga temple: ఇటీవల దేశంలో దేవాలయంలోని అనేక ఆలయాలు తరచుగా వార్తలలో ఉంటున్నాయి. ముఖ్యంగా తిరుమల లడ్డు వివాదం దేశంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటన సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్లింది. అయితే.. ఈ మధ్యకాలంలో అనేక ఆలయాలు తరచుగా ఏదో ఒక వివాదస్పద అంశంతో వార్తలలో ఉంటున్నాయి. తిరుమల లడ్డులో ఇటీవల గుట్కాప్యాకెట్లు కూడా బైటపడ్డాయి.  

 

దీనిపై భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనలు మరువక ముందే విజయవాడలోని ఇంద్రకీలాద్రిలో ఆలయం లడ్డు ప్రసాదం ప్రస్తుతం వార్తలలో నిలిచింది. దుర్గమ్మను దర్శించుకున్న ఒక భక్తుడు అమ్మవారి లడ్డు ప్రసాదం ను స్వీకరించాడు. అయితే.. అతను లడ్డు తిందామని కవర్ తెరిచే సరికి  ఇంతలో అనేక వెంట్రుకలు లడ్డులో బైటపడ్డాయి. దీంతో అతను ఖంగుతిన్నాడు. పవిత్రమైన లడ్డులో వెంట్రుకలు రావడంతో చాలా ఇబ్బందిగా ఫీలయ్యాడు. దీనిపై ఏకంగా ఏపీ సర్కారుకు ట్వీట్ చేశారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, నారా లోకేష్ కు ట్విట్ చేశాడు.

లడ్డులో బైటపడ్డ వెంట్రుకలు ఉన్న ఫోటోలను తీసి ట్విట్ చేశాడు. లడ్డులో వెంట్రుకలు వస్తున్నాయని, దయచేసి నాణ్యతను పాటించేలా చర్యలు తీసుకొవాలని ట్విట్ చేశాడు. ఈ క్రమంలో దీనిపై స్పందించిన మంత్రి ఆనం రామ నారాయణ్ రెడ్డి.. ట్విటర్ వేదికగా  స్పందించారు.  భక్తుడి ఫిర్యాదు మేరకు రామనారాయణ రెడ్డి స్పందించారు. 

Read more: Chilkur Balaji Temple: చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడిపై దాడి.. షాకింగ్ వీడియో వైరల్..

జరిగిన దానిపై క్షమాపణలు కూడా తెలిపారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని భక్తుడికి మంత్రి ఆనం హామీ ఇచ్చారు. ఇంద్రకీలాద్రికి వెళ్లి లడ్డు తయారు చేసే ప్రదేశంను తనిఖీ చేస్తానని కూడా మంత్రి క్లారిటీ ఇచ్చారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News