Govt Jobs: ఏపీ నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్‌.. త్వరలోనే భారీ ఉద్యోగ నోటిఫికేషన్‌

Mega DSC Notification Likely On March Ending: ఆంధ్రప్రదేశ్‌ నిరుద్యోగులకు భారీ శుభవార్త రానుంది. భారీ ఎత్తున ఉద్యోగ ప్రకటనలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. త్వరలోనే ఈ ప్రక్రియ ప్రారంభించి ఈ ఏడాదిలోనే ముగిస్తామని నారా లోకేశ్‌ ప్రకటించారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 1, 2025, 07:43 AM IST
Govt Jobs: ఏపీ నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్‌.. త్వరలోనే భారీ ఉద్యోగ నోటిఫికేషన్‌

Mega DSC Notification: అఖండ మెజార్టీతో అధికారంలోకి కూటమి ప్రభుత్వం ఒక్కో హామీని నెరవేర్చే పనిలో పడింది. ఈ క్రమంలోనే నిరుద్యోగుల ఆశలు నెరవేర్చేందుకు సిద్ధమైంది. త్వరలోనే భారీ ఉద్యోగ ప్రకటన విడుదల చేసేందుకు కార్యాచరణ మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ఒక కీలక ప్రకటన చేసింది. త్వరలోనే మెగా డీఎస్సీ ప్రకటనను విడుదల చేస్తామని తెలిపింది. దీంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. నారా లోకేశ్‌ చేసిన ప్రకటనతో నిరుద్యోగుల్లో ఉత్సాహం మొదలైంది.

Also Read: Vijaysai Reddy: వైసీపీకి రాజీనామా చేస్తూనే విజయ సాయిరెడ్డి సంచలన కోరిక.. 'జగన్‌ మళ్లీ సీఎం కావాలి'

మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఓ సమావేశానికి హాజరైన లోకేశ్‌ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కొన్ని కీలక అంశాలపై స్పందించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ముగియగానే మెగా డీఎస్సీ ఉద్యోగ ప్రకటన ఇస్తామని తెలిపారు. మార్చిలో ప్రక్రియ ప్రారంభించి ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఉద్యోగాల భర్తీ పూర్తి చేస్తామని ప్రకటించారు. ఉపాధ్యాయ పోస్టులు అంటేనే తాము గుర్తుకు వస్తామని.. ఉమ్మడి ఏపీలో... విభజన అనంతరం కూడా ఉపాధ్యాయ పోస్టులను 80 శాతం భర్తీ చేసినట్లు చెప్పారు.

Also Read: Tirumala: తిరుమలలో చాగంటి కోటేశ్వర రావుకు అవమానం కేసులో బిగ్‌ ట్విస్ట్‌

ఈ సందర్భంగా ఉపాధ్యాయ వర్గానికి కూడా నారా లోకేశ్‌ కొన్ని కీలక ప్రకటన చేశారు. ఆరోగ్య శ్రీ బకాయిలతోపాటు ఉద్యోగులు, ఉపాధ్యాయుల పెండింగ్‌ బిల్లులను చెల్లిస్తున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా నిర్వహించేందుకు కొత్త చట్టం తెస్తామని ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెరిగేందుకు.. విద్యార్థులు పాఠశాలకు క్రమంగా వెళ్లేందుకు సరికొత్త చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. వాట్సప్‌ గవర్నెన్స్‌కు సానుకూల స్పందన లభిస్తోందని.. ఎదురవుతున్న చిన్న సమస్యలను వారంలో పూర్తిగా పరిష్కరిస్తామని చెప్పారు. రానున్న రోజుల్లో 520 రకాల సేవలను వాట్సప్‌లో అందుబాటులోకి తెస్తామని తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News