Fire accident in Tirumala Tirupati devasthanam: కలియుగ దైవం తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయంలోని లడ్డు కౌంటర్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో అక్కడున్న సిబ్బంది ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. ముఖ్యంగా తిరుమల లోని ప్రసాదం పంపిణి చేసే ప్రదేశంలో.. 47వ కౌంటర్ వద్ద ఉన్న కంప్యూటర్ సిస్టమ్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు అక్కడున్న సిబ్బంది చెప్పారు.
బ్రేకింగ్ న్యూస్
తిరుమలలో మరో అపశృతి
తిరుమల లడ్డు కౌంటర్లో అగ్ని ప్రమాదం
నిత్యం భక్తులతో కిటకిటలాడే లడ్డు ప్రసాదాలను అందచేసే ప్రాంతంలో ఈ ఘటన జరగడంతో భక్తులు భయబ్రాంతులకు గురై పరుగులు తీశారు
47 వ నెంబరు కౌంటర్లో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది
కంప్యూటర్ సిస్టంకు సంబంధించిన… pic.twitter.com/6MJznZrvtp
— Telugu Scribe (@TeluguScribe) January 13, 2025
వెంటనే వారు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అప్పటికే అక్కడ షార్ట్ సర్క్యూట్ ఏర్పడి.. కాస్తంత మంటలు, దట్టమైన పొగలు ఆ ప్రాంతంలో విస్తరించాయి. దీంతో టీటీడీ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. కంప్యూటర్ వయర్లను చాకచక్యంగా తొలగించారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. కానీఅప్పటికే దట్టమైన పొగలు ఆ ప్రాంతమంతా విస్తరించింది.
ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే.. ఇటీవల తిరుమలలో వరుస ఘటనలతో శ్రీవారి భక్తులు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తొంది. ఇప్పటికే వైకుంఠ ఏకాదశి వేళ.. టోకెన్లు జారీ సమయంలో తొక్కిసలాట చోటు చేసుకుని 6 గురు చనిపోయారు.
మరో 40 మంది వరకు గాయపడ్డారు. ఆ ఘటన జరిగి కనీసం వారం కూడా గడవక ముందే మరో ఘటన జరగడంతో శ్రీవారి భక్తులు మాత్రం తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల అంశం మరోసారి వార్తలలో నిలిచింది.
ఇప్పటి వరకు లడ్డు వివాదం, ఆ తర్వాత.. తిరుమలలో రీల్స్, రాజకీయ నాయకులు వివాదాలు రేకెత్తేలా మాట్లాడిన విషయం తెలిసిందే. దీనిపై టీటీడీ తీవ్రంగా తీసుకుంది. స్వామి వారి మాడ వీధుల్లో రీల్స్ చేయడం, రాజకీయాలు మాట్లాడితే వదిలేదని, కేసులు పెడతామని ఇప్పటికే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter