AP Rains: ఆంధ్ర ప్రదేశ్ లో ఏర్పడిన ఉపరిల ఆవర్తన ప్రభావంతో గడిచిన రెండు రోజుల్లో చిత్తూరు, తిరుపతి, ప్రకాశం , అన్నమయ్య, నెల్లూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడ్డాయి. రానున్న రోజుల్లో ఈ జిల్లాల్లో వర్షాలు విస్తారంగా పడతాయని తెలిపింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉత్తర కోస్తా ప్రాంతంలో చలి తీవ్రత కొనసాగుతుందని ఐఎండీ వెల్లడించింది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో తూర్పు, ఈశాన్య గాలులు వీస్తున్నట్లు అధికారులు చెప్పారు. దీంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో మూడ్రోజులపాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉత్తర కోస్తా ప్రాంతాలు, అలాగే యానాంలో నేటి నుంచి మూడ్రోజుల పాటు పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
అలాగే దక్షిణ కోస్తా ప్రాంతంలో ఇవాళ ఒకట్రోండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అలాగే బుధ, గురువారాల్లో రాయసీమలో ఒకట్రోండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అటు కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో కల్లక్కడల్ తీవ్రంగా ఉంది. అక్కడ సముద్రంలో కొంత భాగం ముందుకు రానుంది. ఈ నేపత్యంలో అక్కడ హెచ్చరికలు జారీ చేశారు. ఆ ఎఫెక్ట్ ఏపీ ఉంది. దీంతో తీర ప్రాంతాల్లో మత్య్స కారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికాలు జారీ చేసింది.
ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..
ఇదీ చదవండి: Prabhas Marriage: ప్రభాస్ మ్యారేజ్ ఫిక్స్.. డార్లింగ్ చేసుకోబోయేది ఈమెనే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.