Sudan coup: నిరసనలతో అట్టుడుకుతున్న సుడాన్...షాక్ ఇచ్చిన అమెరికా..!

Sudan coup: ఆఫ్రికా దేశం సుడాన్​ నిరసనలతో అట్టుడుకుతోంది. ఈ నిరసనల్లో ముగ్గురు మృతి చెందగా..పలువురు గాయపడ్డారు. ఈ తరుణంలో అమెరికా తన సాయాన్ని నిలిపేస్తున్నట్లు ప్రకటించింది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 26, 2021, 04:09 PM IST
  • సుడాన్ లో సైనిక తిరుగుబాటు
  • నిరసనల్లో ముగ్గురు మృతి
  • సాయాన్ని నిలిపేసిన అమెరికా
Sudan coup: నిరసనలతో అట్టుడుకుతున్న సుడాన్...షాక్ ఇచ్చిన అమెరికా..!

Sudan coup: సూడాన్‌లోని ప్రస్తుత ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన సైన్యం.. తాత్కాలిక ప్రధాని అబ్దుల్లా హమ్‌డోక్‌(Abdalla Hamdok) సహా పలువురు అధికారులను నిర్బంధించిన విషయం తెలిసిందే. ఈ తిరుగుబాటు(Sudan coup)కు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనలు చేపడుతున్నారు. ఈ క్రమంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ నిరసనల్లో ముగ్గురు మరణించారు. మరో80 మందికి పైగా గాయాలయ్యాయి.

అమెరికా సాయం కట్..
సుడాన్​లో తాజా పరిణామాలపై అమెరికా(America) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ తిరుగుబాటు చర్యను అగ్రదేశం అమెరికా తీవ్రంగా ఖండించింది. ఈ క్రమంలో సూడాన్‌కు 700 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. సూడాన్‌ ప్రధానితోపాటు అరెస్టు చేసిన వారందరినీ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేసింది. దేశంలో ప్రజా అధికారాన్ని పునరుద్ధరించాలని సూచించింది. 

Also Read:Travel Curbs: భారత్‌పై ప్రయాణ ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా..నవంబర్ 8 నుంచి అమల్లోకి..!

తిరుగుబాటు అనేది సూడాన్‌ పౌరుల ప్రజాస్వామ్య ఆకాంక్షలకు తూట్లుపొడవడమేనని, దేశ రాజ్యాంగ విధానాలను ఉల్లంఘించడమేనని అమెరికా అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ స్పష్టం చేశారు. ఆందోళనకారులపై హింసాత్మక ధోరణి అవలంబించొద్దని, వారిపై ఆయుధాలు ప్రయోగించవద్దని కోరారు. స్థానిక పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని, బలవంతంగా ఏది చేసినా.. అది ఇరు దేశాల మధ్య ఆర్థిక, ద్వైపాక్షిక సంబంధాలను మరింత దెబ్బతీస్తుందని హెచ్చరించారు. ‘ఉగ్రవాదానికి నిధులు సమకూర్చుతున్న దేశాల జాబితా’ నుంచి సూడాన్‌(Sudan)ను అమెరికా గతేడాది తొలగించింది. తాజాగా.. మరోసారి ఈ తరహా ఆంక్షలు విధించేందుకు వెనుకాడబోమన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News