Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం, కూలిన వంతెనలు, భవనాలు, సునామీ హెచ్చరిక జారీ

Earthquake: తైవాన్ ఆగ్నేయతీరాన్ని ఇవాళ తీవ్ర భూకంపం వణికించేసింది. చిన్న భవనాలు, వంతెనలు కుప్పకూలగా..జపాన్ దేశం సునామీ హెచ్చరిక జారీ చేసింది.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 18, 2022, 09:00 PM IST
Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం, కూలిన వంతెనలు, భవనాలు, సునామీ హెచ్చరిక జారీ

Earthquake: తైవాన్ ఆగ్నేయతీరాన్ని ఇవాళ తీవ్ర భూకంపం వణికించేసింది. చిన్న భవనాలు, వంతెనలు కుప్పకూలగా..జపాన్ దేశం సునామీ హెచ్చరిక జారీ చేసింది. 

ఇవాళ ఆదివారం మద్యాహ్నం 2.44 నిమిషాలకు తైవాన్ సమీపంలోని టైటుంగ్ నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో..పది కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంప తీవ్రతను తొలుత 7.2 మ్యాగ్నిట్యూడ్‌గా అంచనా వేయగా, ఆ తరువాత 6.9గా ప్రకటించారు.

తీవ్ర భూకంపం కారణంగా తైవాన్ తీరం వణికిపోయింది. యులి పట్టణంలో ఓ భవనం కూలిపోగా..మరి కొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న వంతెనలు కుప్పకూలాయి. మరికొన్ని ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. భారీ భూకంపం తాకిడికి జనం రోడ్లపై పరుగులు పెట్టిన దృశ్యాలు కన్పిస్తున్నాయి. భూకంపం ప్రభావంతో..నిర్మాణంలో ఉన్న ఆకాశ హర్మ్యాలు అటూ ఇటూ ఊగుతూ భయం రేపాయి.

శనివారం కూడా 6.6 తీవ్రతతో భూకంపం సంభవించినా..ఇవాళ సంభవించిన భూకంపం తీవ్రత ఎక్కువగా ఉంది. తైవాన్ సమీపంలోని మారుమూల దీవులకు జపాన్..సునామీ హెచ్చరికను జారీ చేసింది. దక్షిణ జపాన్‌లో 40 లక్షలమందిని ఖాళీ చేయాల్సిందిగా అధికారులు ఆదేశించారు. బలమైన గాలులు, భారీ వర్షం కారణంగా రవాణా స్థంభించిపోయింది.

Also read: China Accident: చైనాలో మరోసారి రోడ్‌టెర్రర్..27 మంది మృతి, మరో 20 మందికి గాయాలు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebok

Trending News